ముంబై: పానీపూరీ విక్రేతను శివసేన నేత మోసగించాడు. ఫుట్‌పాత్‌లోని కొంత స్థలాన్ని రూ.3 లక్షలకు అమ్మాడు. ఈ ఒప్పందానికి సంబంధించి బాండ్ పేపర్‌పై సంతకం కూడా చేశాడు. రెండేళ్ల తర్వాత మోసపోయినట్లు తెలుసుకున్న పానీపూరీ విక్రేత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (Sena leader Sells footpath) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన ములుండ్ నేత అవినాష్ బాగుల్ 2023లో ఫుట్‌పాత్‌లోని ఒక భాగాన్ని తొలుత దోసెలు అమ్మే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. నెలకు రూ.17,000 చొప్పున వసూలు చేశాడు. ఆ తర్వాత పానీపూరీ విక్రేత సంతోష్ బచ్చులాల్ గుప్తాకు ఆ ఫుట్‌పాత్ స్థలాన్ని రూ.3 లక్షలకు అమ్మాడు.
కాగా, ఆ ఫుట్‌పాత్ స్థలం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు చెందినట్లు పానీపూరీ విక్రేత సంతోష్ గుప్తా రెండేళ్ల తర్వాత తెలుసుకున్నాడు. దీంతో శివసేన నేత అవినాష్ బాగుల్ తన స్థలమని చెప్పి మోసగించాడని ఆరోపించాడు. తన తల్లి బంగారు గాజులు తాకట్టు పెట్టి రూ.3 లక్షలు శివసేన నేతకు ఇచ్చినట్లు వాపోయాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా చెల్లని చెక్కులు ఇచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Sena Leader Dupes Pani Puri
మరోవైపు శివసేన నేత అవినాష్ బాగుల్ ఈ ఆరోపణలను ఖండించాడు. ఫుట్‌పాత్ స్థలాన్ని పానీపూరి విక్రేతకు తాను అమ్మలేదని తెలిపాడు. వ్యాపారం కోసం అతడు తనకు అప్పు ఇచ్చినట్లు చెప్పాడు. దానిని నగదు రూపంలో తిరిగి చెల్లించినట్లు వెల్లడించాడు. తనపై వచ్చిన ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని ఆరోపించాడు.
అయితే శివసేన స్థానిక విభాగం ముఖ్య నేత జగదీష్ శెట్టి ఈ సంఘటనపై స్పందించారు. పార్టీ ఆదేశాల మేరకు దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఎవరికీ అన్యాయం జరుగదని ఆయన అన్నారు.
Also Read:
explosion at firecracker factory | బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు
Watch: కారు తనిఖీ చేసిన పోలీసులు.. డిక్కీలో నిద్రిస్తున్న వ్యక్తిని చూసి షాక్