VishwakSen | మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ‘జాతి రత్నాలు’ ఫేమ్ దర్శకుడు అనుదీప్ కేవీ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ ఇప్పుడు డిజిటల్ సందడికి సిద్ధమైంది. వాలెంటైన్స్ సందర్భంగా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను ఖరారు చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకోగా, ఈ నెల మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
ఒక యువ దర్శకుడు తన సినిమాను పూర్తి చేసే క్రమంలో ఎదుర్కొనే వింతైన పరిస్థితులు, బడ్జెట్ తలపోట్లు మరియు అనుదీప్ మార్క్ ‘సిల్లీ హ్యూమర్’ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కయాదు లోహర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నరేశ్, వీటీవీ గణేశ్ తమ కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నారు. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, అనుదీప్ కేవీ స్టైల్ కామెడీని ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు ‘ఫంకీ’ ఒక క్రేజీ ఛాయిస్ కానుంది.