ముంబై: అదుపుతప్పిన లారీ పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. మరో లారీని ఢీకొట్టింది. వాటి మధ్యలో కారు చిక్కుకోవడంతో మంటలు చెలరేగాయి. కారులో ఉన్నవారితో సహా 8 మంది మరణించారు. 15 మంది గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. (Containers Collide, Catchs Fire) దీంతో మృతుల సంఖ్య పెరుగవచ్చని తెలుస్తున్నది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. గురువారం సాయంత్రం పూణే-బెంగళూరు హైవేలోని నవాలే వంతెన సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కంటైనర్ లారీ పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. మరో లారీని ఢీకొట్టింది. వాటి మధ్య కారు చిక్కుకోవడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.
కాగా, ఢీకొన్న రెండు లారీల మధ్య చిక్కుకున్న కారులో ప్రయాణించిన కుటుంబ సభ్యులంతా మంటల్లో కాలి చనిపోయారు. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు. సుమారు 15 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. దీంతో మృతుల సంఖ్య పెరుగవచ్చని తెలుస్తున్నది. అత్యంత రద్దీగా ఉండే రోడ్డులో ఈ సంఘటన జరుగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Pune famous accident bridge Navle bridge accident #Pune #Navale pic.twitter.com/whuOPcvGAX
— सुदर्शन कणसे 🇮🇳 (@SudarshanKanse) November 13, 2025