Ayatollah Ali Khamene | అందుకే ఖమేనీ బంకర్లో తలదాచుకోలేదు.. చనిపోయినా ఆయన లక్ష్యం నెరవేరింది..!
Ayatollah Ali Khamene : అమెరికా, ఇజ్రాయేల్ సైన్యాలు జరిపిన దాడుల్లో తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamene) మరణించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంత తేలికగా ఆయన శత్రుసేనల దాడిలో నేలకొరుగుతారని ఎవరూ ఊహించలేదు.
Ayatollah Ali Khamene : అమెరికా, ఇజ్రాయేల్ సైన్యాలు జరిపిన దాడుల్లో తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamene) మరణించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంత తేలికగా ఆయన శత్రుసేనల దాడిలో నేలకొరుగుతారని ఎవరూ ఊహించలేదు. మేము వెనుకంజ వేయం అని డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన ఖమేనీ తన భద్రత విషయంలో ఎందుకు నిర్లక్షంగా వ్యవహరించారు? అనేది అంతుపట్టలేదు. అయితే.. భద్రతా దళాలు సూచించినా కూడా టెహ్రాన్‌లోనే ఉండిపోవడం, బంకర్లోకి వెళ్లడానికి నిరాకరించడమే ఖమేనీ ఈరోజు మనకు దూరమవ్వడానికి కారణమని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీం లాహీ వెల్లడించారు.
న్యూఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడిన అబ్దుల్ మజీద్ హకీం లాహీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. 37 ఏళ్లుగా ఇరాన్‌ను పాలించిన ఆయన.. ప్రాణాల్ని కాపాడుకోలేకపోవడానికి గల కారణాలను అబ్దుల్ తెలిపారు.
అబ్దుల్ మజీద్ హకీం లాహీ

అమెరికా, ఇజ్రాయేల్ దళాలు టెహ్రాన్‌పై దాడికి పాల్పడిన సమయంలో నేను ఖమేనీ భద్రతా అధికారులతో మాట్లాడాను. ‘మీరు ఎందుకు ఖమేనీని సురక్షిత ప్రాంతానికి లేదంటే బంకర్లోకి తరలించడం లేదు?’ అని అడిగాను. అందుకు వారు ‘ఆయన అంగీకరించలేద’ని తెలిపారు. ‘ఒకవేళ మీరు టెహ్రాన్‌లోని 90 మిలియన్ల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే.. వారికోసం 90 మిలియన్ల బంకర్లను నిర్మిస్తే అప్పుడు నేను మీరు చెప్పినట్టు బంకర్లోకి వెళ్తాను’ అని అన్నారని చెప్పారు.
అంతేకాదు ‘నేను దేశానికి నాయకుడిని. దేశాధినేత ఎల్లప్పుడూ అందరితో సమానంగానే ఉండాలి. నేను ప్రత్యేక జీవితం గడిపితే.. నేను ఈ దేశ నాయకుడిగా ఎక్కువ రోజులు కొనసాగను అని ఆయన తన కుటుంబసభ్యులతో అంటుండేవారు’ అని అబ్దుల్ మజీద్ హకీం లాహీ ఈ సందర్భంగా వెల్లడించారు.
#WATCH | US-Israel vs Iran conflict | “…I said that we are in a narrative war, and there is a lot of fake news. They were saying that Ayatollah Khamenei lives in a basement or in some very safe place. But when he was martyred, everyone in the world knew that he was in his… pic.twitter.com/CC5mkaezoX
— ANI (@ANI) March 3, 2026
సుప్రీం లీడరైన ఖమేనీకి చావంటే భయం లేదని, ఆయన ఒక వీరుడిలా చనిపోవాలని కోరుకున్నారని.. అనకున్నట్టే అమరుడు అయ్యారని అబ్దుల్ మజీద్ హకీం లాహీ తెలిపారు. కొన్ని నెలల క్రితం ఖమేనీ నాతో పదేపదే ఓ విషయం చెప్పారు. అదేంటేంటే.. ‘నేను ముసలివాడినయ్యాను. నాకు ఇప్పుడు 86 ఏళ్లు. ఆస్పత్రిలో చనిపోతానేమోనని నేను భయపడుతున్నా. లేదంటే ఏదైనా ప్రమాదంలో.. లేదా జ్వరంతోనైనా కన్నుమూస్తానని నా భయం. అలా చనిపోవడం నాకు నచ్చదు. నేను ఒక వీరుడిలా చనిపోవాలనుకుంటున్నా’ అని ఖమేనీ తనతో చెప్పిన మాటల్ని అబ్దుల్ మజీద్ గుర్తు చేసుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

