KTR : మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజల ఇళ్లు కూలగొట్టి.. భూములు లాక్కోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నాడని కేటీఆర్(KTR) విమర్శించారు. మేధావులు అడ్డు చెబుతున్నా సరే మొండిగా ముందుకెళ్లాలని భావిస్తున్న రేవంత్ తీరుపై యన భగ్గుమన్నారు. గాంధీ పేరు చెప్పి ఇండ్లు కూల్చి, ఆయనకు చెడ్డ పేరు తీసుకురావొద్దని స్వయంగా.. గాంధీ మునిమనువడు తుషార్ గాంధీ చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ తొలి దశ కోసం 3 వేల ఎకరాలు అవసరమైన కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం ప్రజెంటేషన్ ఇవ్వడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణతో ఇళ్లు కోల్పోనున్న వారితో కలిసి హియాయత్ సాగర్లో కేటీఆర్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మేధా పాట్కర్ లాంటి మేధావులు కూడా రేవంత్ రెడ్డి చర్యలకు అడ్డు చెబుతున్నారని ఆయన తెలిపారు.
పేదల ఇళ్లు కూల్చి.. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేపట్టడం అవసరమా? అని విమర్శలు వస్తున్నా… నేను రియల్ ఎస్టేట్ గురించే ఆలోచిస్తా. అందులో తప్పేంటి? అని రేవంత్ రెడ్డి బహిరంగంగా అంటున్నాడని కేటీఆర్ వెల్లడించారు. మరి ఇదంతా మూసీ ప్రాజెక్టు సుందరీకరణ కోసం చేస్తున్నాడా లేక భూముల కోసం చేస్తున్నాడు అనుకోవాలా? అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
గాంధీ మునిమనవడు కూడా గాంధీ విగ్రహం వద్దని చెప్తున్నాడు
ఆయన పేరు చెప్పి ఇండ్లు కూల్చి, ఆయనకు చెడ్డ పేరు తీసుకురావొద్దు అని తుషార్ గాంధీ చెప్తున్నాడు
మేధా పాట్కర్ లాంటి మేధావులు కూడా రేవంత్ రెడ్డి చర్యలకు అడ్డు చెప్తున్నారు
నేను రియల్ ఎస్టేట్ గురించే ఆలోచిస్తా తప్పేంటి అని… https://t.co/0VdVHBolP1 pic.twitter.com/m6MsXn9X1C
— Telugu Scribe (@TeluguScribe) March 14, 2026