KTR : పేదల ఇళ్లను కూల్చి… మూసీ సుందరీరకరణ చేయాలనుకుంటున్న కాంగ్రెస్ను ప్రతిక్షణం ప్రశ్నిస్తున్న కేటీఆర్ (KTR) మరోసారి తన నిరసన గళం వినిపించారు. లక్షన్నర కోట్ల విలువైన ఆస్తిని జీరో వాల్యూ చేసే అధికారం సీఎం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూటిగా ప్రశ్నించారు. శనివారం హిమాయత్ సాగర్ బస్తీ ప్రజల గోడును విన్న ఆయన.. తమ హయాంలో జరిగిన మూసీ సుందరీకరణ ఫొటోలను వెబ్సైట్లో పెట్టారని తెలిపారు.
మూసీ సుందరీకరణతో వీధిన పడనున్న కుటుంబాల బాధను విన్న కేటీఆర్ శనివారం హియాయత్ సాగర్లో ప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలోనూ మూసీ సుందరీకరణ చేపట్టామని.. కానీ తాము రేవంత్ రెడ్డిలా డబ్బాలు కొట్టలేదని కేటీఆర్ విమర్శించారు. శుక్రవారం అధికారులు మూసీ సుందరీకరణ వెబ్సైట్లో కొన్ని ఫోటోలు పెట్టారని, అవి తమ ప్రభుత్వం నాటి మూసీ సుందరీకరణ ఫోటోలేనని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తొలి దశ కోసం 3,279 ఎకరాలు, 10వేల నిర్మాణాలు తీసుకుంటామని ప్రభుత్వం గెజిట్ ఇచ్చిందనే విషయాన్ని ప్రస్తావించిన కేటీఆర్.. పక్కనే కోకాపేటలో ఎకరం 100 కోట్లు ఉన్నపుడు, ఇక్కడ కనీసం 50 కోట్లు ఉండదా? అని ప్రశ్నించారు. లక్షన్నర కోట్ల విలువైన ఆస్తిని జీరో వాల్యూ చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు? అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు నిలదీశారు.
నిన్న అధికారులు మూసీ సుందరీకరణ వెబ్ సైట్లో కొన్ని ఫోటోలు పెట్టారు
ఆ ఫోటోలు కూడా మా ప్రభుత్వంలో చేసిన మూసీ సుందరీకరణ ఫోటోలే
3,279 ఎకరాలు, 10వేల నిర్మాణాలు తీసుకుంటామని మొన్న ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది
పక్కనే కోకాపేటలో ఎకరం 100 కోట్లు ఉంది, ఇక్కడ కనీసం 50 కోట్లు ఉండదా?… pic.twitter.com/q9zp4awz9C
— Telugu Scribe (@TeluguScribe) March 14, 2026