BRS Netherlands | ఆమ్స్టర్డామ్లో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలను బీఆర్ఎస్ నెదర్లాండ్స్ బృందం కలిసింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రవాస తెలంగాణ వాసుల పాత్రపై మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి, సంక్షేమానికి కేసీఆర్ (KCR) మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఎంతో అవసరమని మహేశ్ బిగాల అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ మరోసారి అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
కేటీఆర్ (KTR) ఆదేశాల మేరకు త్వరలోనే నెదర్లాండ్స్లో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సభ్యత్వ నమోదు (Membership Drive) కార్యక్రమాన్ని చేపట్టి, పూర్తి స్థాయి నెదర్లాండ్స్ కమిటీని ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేయాలని, బీఆర్ఎస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నెదర్లాండ్స్ బృందానికి ఆయన దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నెదర్లాండ్స్ సభ్యులు పవన్, పృథ్వి, సందీప్, సత్య, గణేశ్ పాల్గొన్నారు.