– రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలి
– బీజేవైఎం నాయకుల డిమాండ్
భువనగిరి అర్బన్, జూలై 28 : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భువనగిరి పట్టణంలో నవ భారత్ డిగ్రీ కళశాలలో ఫీజుల బకాయి- బీజేపీ లడాయి అనే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో నవ భారత్ డిగ్రీ కళాశాలలో సుమారు 300 మంది విద్యార్థులతో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేవైఎం యాదాద్రి భువనగిర జిల్లా అధ్యక్షుడు దయ్యాల కుమారస్వామి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్‌లో ఉండటంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొన్ని కళాశాలలు విద్యార్థుల సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఉండడంతో పరీక్షలు రాయలేకపోవడం, తదుపరి విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందడంలో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను సకాలంలో విడుదల చేస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను వెంటనే పూర్తిస్థాయిలో విడుదల చేయాలి. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ బీజేవైఎం అధ్యక్షుడు మామిడొజు పవన్, గుర్రం ప్రవీణ్ రెడ్డి, రావుల సంతోష్, సుధగాని ఉదయ్ సాయి, కొత్త శ్రవణ్, మధు, ఒక్కల దిలీప్ పాల్గొన్నారు.