వెటర్నరీ వర్సిటీలో మత ప్రచారం.. క్రైస్తవ మత బోధనలు చేస్తున్న ప్రొఫెసర్ దంపతులు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రొఫెసర్లు క్రైస్తవ మత ప్రచారకులుగా మారిన ఘటన రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్‌లో కలకలం రేపుతున్నది. పాఠాలు చెప్పడం పక్కకు పెట్టి మత బోధనలు చేస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.
- చర్చ్‌లకు రావాలని ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థుల ఆవేదన
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రొఫెసర్లు క్రైస్తవ మత ప్రచారకులుగా మారిన ఘటన రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్‌లో కలకలం రేపుతున్నది. పాఠాలు చెప్పడం పక్కకు పెట్టి మత బోధనలు చేస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏకంగా యూనివర్సిటీలోనే మత ప్రచారం చేస్తూ విద్యార్థులను వేధిస్తున్నారు. ఆ దంపతులు గతంలో కోరుట్ల కళాశాలలో కూడా ఇలానే వ్యవహరించి క్రమశిక్షణ చర్యలకు గురైనట్టు సమాచారం.
విద్యార్థులకు ప్రలోభాలు, బెదిరింపులు
ప్రొఫెసర్ దంపతులు ఏకంగా తరగతి గదిలోనే బైబిల్ బోధనలు చేస్తున్నారని, పాఠాలు చెప్పడం కంటే దానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రతి ఆదివారం విద్యార్థులంతా చర్చికి రావాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వారు చెప్పినట్టు నడుచుకోకుంటే ప్రాక్టికల్, ఇంటర్నల్ మార్కులు తగ్గిస్తామని బెదిరిస్తున్నట్టు వాపోతున్నారు. వీసీ, రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేస్తే కోర్సు పూర్తి చేయలేరని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు బలవంతంగా మతమార్పిడికి గురైనట్టు పేర్కొంటున్నారు. వర్సిటీలో మత ప్రచారం చేస్తున్న ప్రొఫెసర్ దంపతులపై విచారణ చేపట్టాలని రిజిస్ట్రార్ ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులతో కమిటీని నియమించారు. కమిటీ విచారణ ప్రారంభం కాకముందే నీరుగారిపోయే పరిస్థితి నెలకొన్నది. విచారణ తూతూ మంత్రంగానే సాగుతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ చేపట్టి ఎలాంటి తప్పిదాలు జరుగడం లేదని తేల్చేందుకే సదరు ప్రొఫెసర్‌ను చైర్మన్‌గా నియమించారనే ప్రచారం జరుగుతున్నది. కమిటీ విచారణను పకడ్బందీగా చేపట్టేలా, మత ప్రచారాలకు అడ్డుకట్ట వేసేలా చర్య లు తీసుకోవాలని వీసీ, రిజిస్ట్రార్‌ను కోరుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

