సాగర్ నీళ్లు పాలేరుకు ఎట్లిస్తరు.. సొంత జిల్లా రైతుల పొట్టకొడుతరా?
సాగర్ నీళ్లు పాలేరుకు ఎలా? వదులుతారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాద వ్ కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించారు. నీళ్ల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా రైతుల పొట్టకొడుతరా? అని మండిపడ్డారు. సాగర్ ఆయకట్టుకు నీళ్లు, కరెంటు ఇ వ్వకుండా క్షోభకు గురిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ముక్కు నేలకు రాసి, రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
- మంత్రి ఉత్తమ్ తీరుపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఫైర్
- సర్కార్ తీరుకు నిరసనగా మునగాలలో ఆందోళన
మునగాల, సెప్టెంబర్ 22 : సాగర్ నీళ్లు పాలేరుకు ఎలా? వదులుతారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాద వ్ కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించారు. నీళ్ల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా రైతుల పొట్టకొడుతరా? అని మండిపడ్డారు. సాగర్ ఆయకట్టుకు నీళ్లు, కరెంటు ఇ వ్వకుండా క్షోభకు గురిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ముక్కు నేలకు రాసి, రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాగు నీటితోపాటు కరెంటు కోతలకు నిరసనగా మంగళవారం వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులతో కలిసి బొల్లం సూర్యాపేట జిల్లా మునగాల సబ్‌స్టేషన్ ముట్టడించారు. అనంతరం విజయవాడ హైవేపై బైఠాయించారు. దీంతో రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం ప్రభుత్వ తీరును నిరసిస్తూ దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ నీటితో చెరువులు నింపి పంటలు కాపాడాల్సిన మంత్రి ఉత్తమ్ సొంత జిల్లా రైతులకు నీళ్లు ఇవ్వకుండా పక్క జిల్లాకు ఇస్తున్నాడని మండిపడ్డారు. గత నెల 25న సాగర్ నీటిని విడుదల చేసినప్పుడు చెరువులు నిం పాలని స్పష్టమైన ఆదేశాలున్నా.. ఆయకట్టు రైతాంగానికి చుక్క నీరు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసి, రాజీనామాకు పట్టుబడితే రెండో విడుతలో నీళ్లు వదిలారని, ఆ నీటిని కోదాడ, హుజూర్నగర్ నియోజక వర్గాల పరిధిలోని ఆయకట్టు రైతుల పొలాలకు ఇవ్వకుండా పక్క జిల్లాలోని పాలేరుకు తరలించారని మండిపడ్డారు. తన సొంత జిల్లా రైతుల గోడు పట్టించుకోకుండా హెలికాప్టర్లో చక్కర్లు కొడుతూ షికార్లు చేస్తు న్న మంత్రి ఉత్తమ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. రైతులకు 24 గంటల కరెంటు, నీళ్లు ఇవ్వకపోతే జిల్లా మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. బొగ్గు, నీరు పుష్కలంగా ఉన్నా రైతులకు కరెంటు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నదని దుయ్యబట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

