భోపాల్: ఎక్స్‌ప్రెస్ వేపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. రోడ్డు నుంచి పక్కకు దూసుకెళ్లింది. రహదారి మధ్యలో ఉన్న లోతైన గుంతలో పడింది. (Speeding Car Plunges Into Ditch) అందులో ప్రయాణించిన ఐదుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరు వ్యక్తులు కారులో ఢిల్లీ నుంచి గుజరాత్‌కు బయలుదేరారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై ఆ కారు వేగంగా ప్రయాణించింది.
కాగా, శుక్రవారం ఉదయం 7.45 గంటల సమయంలో మధ్యప్రదేశ్ రత్లాం జిల్లాలోని భీంపుర గ్రామం సమీపంలో ఆ కారు అదుపుతప్పింది. మహీ నది వంతెన సమీపంలో కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఎక్స్‌ప్రెస్ వే లేన్ నుంచి ఆ కారు పక్కకు దూసుకెళ్లింది. మధ్యలో ఉన్న చాలా ఎత్తు నుంచి లోతైన గుంతలో పడింది. అందులో ప్రయాణించిన ఐదుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు.

Car Fallen In Ditch
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. పోస్ట్‌మార్టం కోసం రత్లాంలోని డాక్టర్ లక్ష్మీ నారాయణ్ పాండే ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.
కాగా, మృతులు ముంబై, అహ్మదాబాద్‌కు చెందినవారని పోలీసులు గుర్తించారు. మృతుల్లో 15 ఏళ్ల బాలుడు, 70 ఏళ్ల వృద్ధుడు ఉన్నట్లు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. మరోవైపు ఎక్స్‌ప్రెస్ వేపై ఉన్న సీసీటీవీలో రికార్డైన కారు ప్రమాదం వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Ratlam Delhi-Mum Expressway🚨⚠️
– Footage 7:47am, #Black SUV (maybe KIA Carens) goes off the road…5 Dead as per news…
– Flat Stretch, Drowsy Driver?⚠️
– No Crash Barriers on E’way @DriveSmart_IN @dabir @InfraEye @sss3amitg
pic.twitter.com/44eekGUoE2— Dave (Road Safety: City & Highways) (@motordave2) November 14, 2025
Also Read:
Akhilesh Yadav | బీజేపీ పార్టీ కాదు, మోసగాడు.. ఇతర రాష్ట్రాల్లో ‘సర్’ ఆటలు సాగవు: అఖిలేష్ యాదవ్
Flipkart | ఫ్లిప్‌కార్ట్‌కు నకిలీ కస్టమర్లు టోపీ.. రూ.1.6 కోట్ల విలువైన 332 ఫోన్లు చోరీ
Watch: కారు తనిఖీ చేసిన పోలీసులు.. డిక్కీలో నిద్రిస్తున్న వ్యక్తిని చూసి షాక్