Eyes | కళ్లలో తరచూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి..
కంటిలోని తెల్లని భాగంలో ఒక్కోసారి అకస్మాత్తుగా ఎర్రనిమచ్చ కనిపిస్తుంది. దీనిని చూడగానే చాలా మంది భయపడతారు. ఇది పెద్ద కంటి సమస్యలాగా కనిపిస్తుంది కానీ అన్ని సందర్భాల్లో ఇది ప్రమాదం కాదు. ఈ పరిస్థితిని సబ్ కంజంక్టైవల్ హేమరేజ్ అని అంటారు.
Eyes | కంటిలోని తెల్లని భాగంలో ఒక్కోసారి అకస్మాత్తుగా ఎర్రనిమచ్చ కనిపిస్తుంది. దీనిని చూడగానే చాలా మంది భయపడతారు. ఇది పెద్ద కంటి సమస్యలాగా కనిపిస్తుంది కానీ అన్ని సందర్భాల్లో ఇది ప్రమాదం కాదు. ఈ పరిస్థితిని సబ్ కంజంక్టైవల్ హేమరేజ్ అని అంటారు. ఇందులో ట్రామాటిక్, స్పాంటేనియస్ లేదా నాన్ ట్రామాటిక్ సబ్ కంజంక్టైవల్ హేమరేజ్ అని రెండు రకాలుగా ప్రధానంగా ఉంటాయి. కంటికి గాయం కావడం వల్ల, కళ్లను బలంగా రుద్దడం వల్ల, కంటి శస్త్ర చికిత్స, కాంటాక్ట్ లెన్స్ వాడకం వల్ల ట్రామాటిక్ సబ్ కంజంక్టైవల్ హేమరేజ్ వస్తుంది. ఇక స్పాంటేనియస్ సబ్ కంజంక్టైవల్ హేమరేజ్ మాత్రం ఎలాంటి గాయం లేకుండానే వస్తుంది. బలంగా దగ్గడం, తుమ్మడం, వాంతులు వంటి వాటితో పాటు హైబీపీ, డయాబెటిస్ లేదా రక్త సంబంధిత సమస్యలు ఉన్న వారిలో ఎక్కువగా వస్తుంది.
కారణాలు ఇవే..
బయటకు కనిపించే కంటి తెల్లభాగాన్ని స్కేర్లా అంటారు. దీనిపై కంజంక్టైవా అనే పలుచని పొర ఉంటుంది. ఈ పొరలో చాలా చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాల్లో ఒకటి పగిలితే రక్తం కంజంక్టైవా కింద చేరి ఉంటుంది. రక్తం అక్కడే నిలిచి పోవడం వల్ల కంటిలో ఎర్రటి మచ్చలా కనిపిస్తుంది. ఇది చూపును ప్రభావితం చేయదు. ఇన్సెక్షన్ లేదా వాపు వంటి సమస్యలు కూడా రావు. బలంగా దగ్గడం, తుమ్మడం, వంగి పని చేయడం, తలకిందులుగా నిలబడడం వంటి వాటితో పాటు అస్పిరిన్, వార్పరిన్, హెపారిన్ వంటి మందులు కూడా దీనికి కారణం అవుతాయి. కొన్ని సార్లు ఎటువంటి కారణం లేకుండా కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అలాగే ఈ సమస్య 1 నుండి 2 వారాల్లో దానంతట అదే స్వయంగా తగ్గుతుంది. రక్తం కరిగి తిరిగి శరీరం గ్రహించేటప్పుడు ఎర్రటి రంగు, పసుపు లేదా గోధుమ రంగులోకి మారి పూర్తిగా నయం అవుతుంది. ఈ సమస్య ఎటువంటి లక్షణాలను చూపించదు, కొంచెం ఇబ్బందిగా ఉంటే ఆర్టిఫిషియల్ టియర్స్ వాడితే ఉపశమనం కలుగుతుంది. సాధారణంగా ప్రత్యేక చికిత్స అంటూ అవసరం ఉండదని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య ప్రమాదకరం కానప్పటికీ కొన్ని పరిస్థితుల్లో మాత్రం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
తరచూ వస్తుంటే జాగ్రత్త..
ఎర్రటి మచ్చ పదే పదే రావడం, కంటిలో నొప్పి, చూపు మసకబారడం, కంటిచుట్టూ వాపు, కంటి గాయం అయిన తరువాత ఎర్రటి మచ్చ కనిపించడం వంటి పరిస్థితుల్లో మాత్రం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. అలాగే ఈ సమస్యను పూర్తిగా నివారించలేరు. కానీ కొన్ని అలవాట్లు ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెప్పవచ్చు. కళ్లను బలంగా రుద్దడం వంటివి చేయకూడదు. అలర్జీలను నియంత్రించాలి. దీని వల్ల గట్టిగా తుమ్మడాన్ని తగ్గించవచ్చు. బీపీ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. ఆటలు ఆడే సమయంలో కళ్లకు రక్షణగా కళ్లజోడును ధరించాలి. రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడే వారు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కంటిలో ఆకస్మాత్తుగా కనిపించే ఈ ఎర్రటి మచ్చ చాలా సందర్భాల్లో ప్రమాదం కాదు. ఇది చిన్న రక్తనాళం పగిలి ఏర్పడే సబ్ కంజంక్టైవల్ హేమరేజ్ మాత్రమే అని సాధారణంగా దానంతట అదే తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య పదే పదే రావడంతో పాటు నొప్పి, చూపులో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- eyes
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

