శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు (Omar Abdullah) షాక్ ఎదురైంది. గత ఏడాది ఆయన రాజీనామా చేసిన కంచుకోట బుద్గామ్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఓడిపోయింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అభ్యర్థి అగా సయ్యద్ ముంతాజీర్ ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. గత ఏడాది జరిగిన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబానికి కంచుకోట అయిన గండేర్బాల్తోపాటు పార్టీ కంచుకోట బుద్గామ్‌లో ఒమర్ అబ్దుల్లా పోటీ చేశారు. రెండు స్థానాల్లో గెలుపొందడంతో బుద్గామ్ స్థానానికి రాజీనామా చేశారు.
కాగా, నవంబర్ 11న బుద్గామ్తోపాటు నగ్రోటాకు ఉప ఎన్నికలు జరిగాయి. శుక్రవారం వెలువడిన ఫలితాలు సీఎం ఒమర్ అబ్దుల్లాకు షాక్ ఇచ్చాయి. మెహబుబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ అభ్యర్థి అగా సయ్యద్ ముంతాజీర్ బుద్గామ్‌లో విజయం సాధించారు. ఎన్సీ అభ్యర్థి అగా సయ్యద్ మహమూద్‌ను 4,478 ఓట్ల తేడాతో ఓడించారు. షియా ముస్లింల ప్రాబల్యం ఉన్న బుద్గాంలో ఎన్సీకి ఇదే తొలి పరాజయం. 1972లో ఎన్నికలు బహిష్కరించినప్పుడు తప్ప 1957 నుంచి ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానంలో ఎన్సీ విజయం సాధించింది.
మరోవైపు నగ్రోటా ఉప ఎన్నికలో కూడా ఎన్సీకి పరాజయం ఎదురైంది. బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా 24,647 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. దివంగత తండ్రి స్థానాన్ని ఆమె నిలుపుకున్నది. జమ్మూ కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ అభ్యర్థి హర్ష్ దేవ్ సింగ్‌ను ఓడించింది. ఎన్సీ అభ్యర్థి షమీమ్ బేగం 10,872 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు.
Also Read:
Anant Kumar Singh | జైల్లో ఉన్న జేడీయూ అభ్యర్థి.. మోకామా స్థానంలో గెలుపు
Flipkart | ఫ్లిప్‌కార్ట్‌కు నకిలీ కస్టమర్లు టోపీ.. రూ.1.6 కోట్ల విలువైన 332 ఫోన్లు చోరీ
Woman Kills Husband | మరిదితో వివాహేతర సంబంధం.. గొడ్డలితో నరికి భర్తను హత్య
Watch: ఎక్స్‌ప్రెస్ వేపై అదుపుతప్పిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?