ముంబై: ఒక మహిళకు మరిదితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను వారు హత్య చేశారు. గొడ్డలితో నరికి చంపారు. (Woman Kills Husband) మృతదేహాన్ని సంచిలో కుక్కి చెరువులో పడేశారు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 13న సోమ్‌థానా గ్రామంలోని చెరువులో పడేసిన సంచిలో కుక్కిన ఒక వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడ్ని పరమేశ్వర్ రామ్ టేడేగా గుర్తించారు. అతడి తండ్రి ఫిర్యాదుపై హత్య కేసు నమోదు చేశారు.
కాగా, పరమేశ్వర్ భార్య మనీషా, అతడి తమ్ముడు జ్ఞానేశ్వర్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వారిద్దరిని ప్రశ్నించగా తొలుత బుకాయించారు. పోలీసులు గట్టిగా నిలదీయంతో నిజం ఒప్పుకున్నారు. తమ మధ్య వివాహేతర సంబంధం ఉన్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో అడ్డుగా ఉన్న పరమేశ్వర్‌ను గొడ్డలితో నరికి చంపి మృతదేహాన్ని సంచిలో కుక్కి చెరువులో పడేసినట్లు చెప్పారు. దీంతో మనీషా, జ్ఞానేశ్వర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Anant Kumar Singh | జైల్లో ఉన్న జేడీయూ అభ్యర్థి.. మోకామా స్థానంలో గెలుపు
Flipkart | ఫ్లిప్‌కార్ట్‌కు నకిలీ కస్టమర్లు టోపీ.. రూ.1.6 కోట్ల విలువైన 332 ఫోన్లు చోరీ
Watch: ఎక్స్‌ప్రెస్ వేపై అదుపుతప్పిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?