మునుగోడు, మార్చి 16 : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తూ సోమవారం మునుగోడు మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గురజా రామచంద్రం మాట్లాడుతూ.. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజలపై భారాలు వేస్తూ, గుళ్లపేట, దేవుళ్ల పేరా మతతత్వం రెచ్చగొడుతూ దేశాన్ని విచ్ఛిన్నకరం చేస్తున్నారన్నారు. ప్రజలు స్వేచ్ఛా, స్వాతంత్రాలతో బతకాలని అలాంటి హక్కు మానవాళికుందని అన్నారు. ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యులు బిలాలు, ఎస్.చలపతి, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు బండమీది యాదయ్య, ఉప్పునూతల రమేశ్, దుబ్బ వెంకన్న, ఏఐటీయూసీ మండల కార్యదర్శి బెల్లం శివయ్య, మునుగోటి దయాకర్, మందుల పాండు, ఈదులకంటి కైలాస్, బండారు శంకర్, జక్కల మల్లయ్య, టి.సైదులు పాల్గొన్నారు.