The Great Grand Superhero | బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ (Jackie Shroff) ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ది గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో: ఏలియన్స్ కా ఆగమన్’ (The Great Grand Superhero – Aliens Ka Aagman). జీ స్టూడియోస్ (Zee Studios) సమర్పణలో మనీష్ సైనీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఒక సరికొత్త ఫాంటసీ కామెడీ డ్రామాగా రాబోతుండగా.. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది.
టీజర్ చూస్తుంటే.. ఒక పాఠశాల విద్యార్థి తన కుటుంబ రహస్యం గురించి స్నేహితుడితో చెప్పడంతో ప్రారంభమవుతుంది. తన తాతయ్యకు అద్భుత శక్తులు (Superpowers) ఉన్నాయని, ఒకవేళ ఆ విషయం బయటపడితే తాతయ్య శక్తులు కోల్పోవడమే కాకుండా, భూమిపై ఏలియన్స్ (Aliens) దాడి చేసే అవకాశం ఉందని ఆ బాలుడు భయపడతాడు. ఇక టీజర్ చివరలో జాకీ ష్రాఫ్ సూపర్ హీరో కాస్ట్యూమ్‌లో మెరిసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత (1985లో వచ్చిన ‘శివ కా ఇన్సాఫ్’ తర్వాత) ఆయన మళ్లీ సూపర్ హీరో పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్‌తో పాటు ప్రతీక్ బబ్బర్, భాగ్యశ్రీ, శరత్ సక్సేనా, సాహర్ష్ శుక్లా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2026 వేసవి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.