Towel Dance: టవల్ కట్టుకుని డ్యాన్స్ చేసిన విద్యార్థినులు.. స్కూల్‌కు నోటీసులు ఇచ్చిన ఎన్హెచ్ఆర్సీ
Towel Dance: ఓ స్కూల్ కార్యక్రమంలో ఇద్దరు బాలికలు ఓ పాటకు టవల్ కట్టుకుని డ్యాన్స్ చేశారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. స్కూల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆ స్కూల్‌కు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు ఇచ్చింది.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఓ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఇద్దరు బాలికలు టవల్ కట్టుకుని నృత్యం(Towel Dance) చేశారు. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రంలోని మేరే ఖాబో మే ఆయే అన్న బాలీవుడ్ సాంగ్ పై డ్యాన్స్ చేశారు. ఈ వీడియో కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ సినిమాలో నటి కాజోల్ కూడా ఒంటికి తెల్లటి టవల్ కట్టుకుని ఆ పాటపై డ్యాన్స్ చేస్తుంది. అదే రీతిలో కూడా స్కూల్ అమ్మాయిలు స్టెప్పులేశారు. అయితే సోషల్ మీడియాలో ఆ స్కూల్ సాంగ్‌పై విమర్శలు వచ్చాయి. అసభ్యంగా, అశ్లీలంగా ఉన్నట్లు కొందరు కామెంట్ చేశారు. స్కూళ్లో పిల్లలో ఇలాంటి డ్యాన్సులు వేయడం ఏంటని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) సదురు స్కూల్‌కు నోటీసు జారీ చేసింది. స్కూల్లో ఇలాంటి డ్యాన్సులకు అనుమతి ఇవ్వడం అంటే, ఆ స్కూల్లో యాజమాన్య నిర్వహణ లోపం ఉన్నట్లు భారత మానవ హక్కుల సంఘానికి ఓ ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. ఇలాంటి నృత్యాలు పిల్లల ప్రవర్తనపై చెడు ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. స్కూల్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి వివరణతో కూడిన రిపోర్టు ఇవ్వాలని ఫిర్యాదులో కోరారు. మైనర్ అమ్మాయిలను శృంగారభరితంగా చూపించే నృత్యాలను కానీ, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఇలాంటివి ప్రదర్శించకుండా ఉండేందుకు విద్యాసంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాలని ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదులో కోరారు.
స్కూల్‌తో పాటు విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, సిటీ పోలీసు కమీషనర్, బెంగాల్ జిల్లా మెజిస్ట్రేట్‌కు కూడా నోటీసు జారీ చేశారు. తమకు అందిన ఫిర్యాదులోని అంశాలను పరిశీలించాలని ఆ నోటీసులు ఆదేశించారు. రెండు వారాల్లోగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో రిపోర్టు ఇవ్వాలని మానవ హక్కుల సంఘం ఆదేవించింది.
An English medium CBSE board school organised this mujra event.
Look at how shamelessly these girls are doing vulgar mujra.
So many children are in the audience. What will they learn?
Organisers of this event should be arrested.
Why can’t we have a mujra free society? pic.twitter.com/CgS1uku7zL
— ︎ ︎venom (@venom1s) March 14, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

