Divyanka Tripathi | బాలీవుడ్ బుల్లితెర మోస్ట్ పాపులర్ జంట దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియా త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2016 జూలై 8న వివాహం చేసుకున్న ఈ జంట, పెళ్లయిన పదేళ్ల తర్వాత తమ మొదటి బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ‘యే హై మొహబ్బతేన్’ సీరియల్ సెట్స్‌లో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం పెళ్లి పీటల వరకు వెళ్ళింది. ప్రస్తుతం దివ్యాంక ఆరో నెల గర్భవతి అని, ఈ ఏడాది జూన్ నెలలో ఆమె ప్రసవం ఉండవచ్చని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.
ఈ క్రమంలో ముంబైలో దివ్యాంక సీమంతం (బేబీ షవర్) వేడుకను అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా దివ్యాంక గర్భం గురించి పలుమార్లు పుకార్లు వచ్చినప్పటికీ, ఈసారి ఆమె గత కొంతకాలంగా షూటింగులకు దూరంగా ఉండటం, సోషల్ మీడియాలో పెద్దగా కనిపించకపోవడంతో ఈ వార్తలు నిజమేనని అభిమానులు నమ్ముతున్నారు.