Industrial Park | కేసీఆర్ రైతు బంధు ఇస్తుండే.. మా ఊరికి నీళ్లు తెచ్చిండు. నేను 55 సంవత్సరాలున్న. ఇంతవరకు ఇలాంటి మోసాన్ని ఎప్పుడు చూడలేదని సీఎం రేవంత్ రెడ్డిపై పరిగి మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూమి కోల్పోతున్న రైతు ఫైర్ అయ్యాడు. రేవంత్ రెడ్డి మా జిల్లావాడు అనుకుంటే మమ్మల్నే మోసం చేస్తున్నాడని బాధిత రైతు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఇంకోసారి ఓటు వేయమని మా దగ్గరికొస్తే చెప్పు తీసుకొని కొడతామని హెచ్చరించాడు.
నాది 4 ఎకరాలు. నా భూమైతే నాక్కావాలి. ఎకరానికి కోటి రూపాయలు కాదు రూ.10 కోట్లు ఇచ్చినా, మేము సచ్చినా మా భూములైతే ఇవ్వమని అల్టిమేటం జారీ చేశాడు. మాది మొత్తం 36 ఎకరాలున్నయి. మావి ఒక్క దగ్గరే 10 కుటుంబాలున్నాయి. మేమంతా ఆన్నే పడి చేస్తం.. వాడన్నా చావాలే.. మేమన్నా చావలే.. భూములు మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశాడు.
మా భూములు లాక్కుంటే మాకు చావడమే దిక్కవుతదని మరో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రేవంత్ రెడ్డికు ఓటేసిన పాపానికి మా భూములు గుంజుకుంటున్నాడనడి మండిపడ్డాడు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓట్లేస్తే ఉన్న ఇండ్లు కూడా గుంజుకుంటారన్నాడు.
రేవంత్ రెడ్డి మా జిల్లావాడు అనుకుంటే మమ్మల్నే మోసం చేస్తున్నాడు
ఇంకోసారి ఓటు అని వస్తే చెప్పు తీసుకొని కొడతాం
ఎకరానికి రూ.10 కోట్లు ఇచ్చినా, మేము సచ్చినా మా భూములైతే ఇవ్వం – పరిగి మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణలో భూమి కోల్పోతున్న బాధితుడు https://t.co/icos9zfTiM pic.twitter.com/b2ro3R31sS
— Telugu Scribe (@TeluguScribe) March 11, 2026
మా భూములు లాక్కుంటే మాకు చావడమే దిక్కవుద్ది
రేవంత్ రెడ్డికు ఓటేసిన పాపానికి మా భూములు గుంజుకుంటున్నాడు
కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓట్లేస్తే ఉన్న ఇండ్లు కూడా గుంజుకుంటారు – పరిగి మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూమి కోల్పోతున్న రైతు https://t.co/IDZ9RzGus7 pic.twitter.com/J2hCbCcsFM
— Telugu Scribe (@TeluguScribe) March 11, 2026
Vadhala Movie | జగపతి బాబు ‘వదలా’ గ్లింప్స్ విడుదల.. ఆకట్టుకుంటున్న సస్పెన్స్ థ్రిల్లర్!
Ek Din Trailer | ఆమిర్ ఖాన్ తనయుడితో సాయి పల్లవి రొమాన్స్.. ‘ఏక్ దిన్’ ట్రైలర్ విడుదల