Ek din Movie | బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ మరియు సౌత్ సెన్సేషన్ సాయి పల్లవి జంటగా నటించిన క్రేజీ చిత్రం ‘ఏక్ దిన్’. ఈ సినిమా ట్రైలర్ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. ఈ సినిమాకు సునీల్ పాండే దర్శకత్వం వహిస్తుండగా ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. హీరోయిన్ కేవలం ఒకే ఒక రోజు హీరోతో ప్రేమలో గడపాలనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రాబోతుండగా.. ఈ చిత్రం ద్వారా సాయి పల్లవి హిందీ తెరకు పరిచయం కాబోతోంది. రామ్ సంపత్ సంగీతం, అరిజిత్ సింగ్ గాత్రం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 1, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.