సెపాంగ్ (మలేషియా) : రెడ్‌బుల్ స్టార్ డ్రైవర్, నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ 2026 ఫార్ములా వన్ సీజన్లో బోణీ కొట్టాడు. సెపాంగ్ సర్క్యూట్లో ఆదివారం జరిగిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రిలో సంచలన విజయం సాధించాడు. గంటా 47 నిమిషాల 14.808 సెకండ్లలో టాప్ ప్లేస్ సాధించాడు.
రేసు ఆఖరి ఘట్టంలో మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రస్సెల్ సాంకేతిక లోపంతో వైదొలగడంతో ఆ జట్టుకే చెంది న కిమీ ఆంటోనెల్లి (+2.307 సె) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫెరారీ దిగ్గజం లూయిస్ హామిల్టన్ (+4.919 సె)మూడో స్థానంలో నిలిచాడు.