Vadhala Movie | జగపతి బాబు, లయ, హృతిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వదలా’ (Vadhala). వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌తో పాటు కిశోర్ నాయుడు కలిసి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయగా ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఈ గ్లింప్స్ ఆధారంగా పరిశీలిస్తే.. ఇది ఒక వ్యక్తి జీవితం మరియు అతని చుట్టూ అల్లుకున్న రహస్యాల నేపథ్యంలో సాగే గ్రిప్పింగ్ డ్రామా అని స్పష్టమవుతోంది. ముఖ్యంగా జగపతి బాబు నటన, ఆయన పాత్ర తీరుతెన్నులు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. చాలా కాలం తర్వాత లయ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించబోతుండటం విశేషం. గ్లింప్స్‌లోని విజువల్స్ మరియు నేపథ్య సంగీతం సినిమాలోని తీవ్రతను, ఉత్కంఠను తెలియజేస్తున్నాయి. ఒక విభిన్నమైన పాయింట్‌తో, ఎమోషనల్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.