Nagarjuna | గతేడాది కుబేర, కూలీ సినిమాలతో సూపర్ హిట్స్‌ను ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున. ప్రస్తుతం అభిమానులు, మూవీ లవర్స్ ఫోకస్ అంతా నాగార్జున కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోయే 100వ ప్రాజెక్ట్‌పైనే ఉంది. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు రా కార్తీక్ (Ra Karthik)డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అప్డేట్ ఎప్పుడెప్పుడొస్తుందా..? అని ఎదురుచూస్తున్న వారిలో రా కార్తీక్ చేసిన కామెంట్స్ జోష్ నింపుతున్నాయి.
రా కార్తీక్ ఓ చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. 40 ఏండ్లకుపైగా సినీ కెరీర్లో నాగార్జున ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారు. ఆయన ప్రియదర్శన్, మణిరత్నంతోపాటు పలువురు మలయాళ దర్శకులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయన చాలా అంశాలను ప్రేక్షకులను చూపించారు. తమిళ ఫిల్మ్ మేకర్స్‌తో కూడా నాగార్జున విస్తృతంగా పనిచేశారు. కాబట్టి నేను ఎక్కడి (ఏ ఇండస్ట్రీ) నుండి వస్తున్నాననే విషయంలో ఆయనకు ఎటువంటి సమస్య కనిపించలేదని చెప్పుకొచ్చాడు రా కార్తీక్.
సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. అధికారిక ప్రకటన త్వరలోనే ఉండబోతుంది. ఇది నాగార్జున సినిమానే.. కానీ 100వ సినిమా అని ఖచ్చితంగా చెప్పలేను. ‘నిథమ్ ఒరు వానం’ ఒక నిర్ధిష్ట జీవితం గురించి ఉంటే.. ఈ ప్రాజెక్ట్ అంతా మరో జీవితం గురించి సాగుతుంది. జోనర్ విషయానికొస్తే యాక్షన్, క్రూరత్వంతో కూడిన ఎలిమెంట్స్ ఉంటాయి. నాలో చూడని మరో కోణాన్ని బయటపెట్టానని అనుకుంటున్నా. ఏ స్థాయిలో యాక్షన్ ఉంటుందో.. అందుకు కనెక్ట్ అయ్యే భావోద్వేగాలు కూడా ఉంటాయన్నాడు రా కార్తీక్.
అంతేకాదు ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వడానికి కేవలం నమ్మకమే కారణమని డైరెక్టర్ రా కార్తీక్ అన్నాడు. ఆయన (నాగార్జున)కు నేనంతగా తెలియదు. కానీ నాపై ఆయనకున్న నమ్మకం వల్లే ఇది సాధ్యమైంది. ఒకవేళ నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే చాలా మంది కొత్త దర్శకులు కూడా స్టార్ యాక్టర్లను సంప్రదిస్తారు.. వాళ్లు కూడా కథలు వింటారు. నేను ఈ విషయాన్ని బ్రేక్ చేయాలనుకోవడం లేదు. ఇది నాగార్జున సార్‌లోని మరో డైమన్షన్‌ను చూపించే పక్కా తెలుగు సినిమా.. అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
యూనిక్ స్టోరీ టెల్లింగ్, థ్రిల్లింగ్ కథనాలతో తనదైన మార్క్ చూపించే రా కార్తీక్ నాగార్జున కెరీర్ మైల్స్టోన్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రేజీ డైరెక్టర్ ఇంతకీ నాగ్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశాడు. కూలీలో తొలిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన నాగార్జున మరి రా కార్తీక్‌తో ఎలాంటి కథ చేయబోతున్నాడన్నది సస్పెన్స్ నెలకొంది.
#Nag100 Director Ra. karthik About #Nagarjuna :
over the last 40 years he has broken many boundaries. He brought several Malayalam directors into Telugu cinema, including #Priyadarshan and #ManiRatnam. He has explored a lot and has also worked extensively with Tamil filmmakers,… pic.twitter.com/0hEawKL93e
— FilmyBowl Tamil (@FilmyBowlTamil) March 11, 2026