SKY | కంబ్యాక్ కోసం సూర్యకుమార్ కసరత్తు.. కేవలం 3 గంటల్లో 1000 బంతులు ఎదుర్కొని షాక్ ఇచ్చిన ‘స్కై’!
SKY | టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన పట్టుదలను ప్రపంచానికి చాటిచెప్పాడు. ఇటీవల జాతీయ జట్టులో చోటు కోల్పోయిన ఈ డైనమిక్ బ్యాటర్ ఏమాత్రం నిరాశ చెందకుండా తిరిగి ఫామ్‌లోకి రావడమే లక్ష్యంగా కఠిన సాధన కొనసాగిస్తున్నాడు.
SKY | టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన పట్టుదలను ప్రపంచానికి చాటిచెప్పాడు. ఇటీవల జాతీయ జట్టులో చోటు కోల్పోయిన ఈ డైనమిక్ బ్యాటర్ ఏమాత్రం నిరాశ చెందకుండా తిరిగి ఫామ్‌లోకి రావడమే లక్ష్యంగా కఠిన సాధన కొనసాగిస్తున్నాడు. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఏకంగా 1000 బంతులను ఎదుర్కొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రపంచ క్రికెట్లో “మిస్టర్ 360 డిగ్రీస్”గా గుర్తింపు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ గత కొంతకాలంగా బ్యాట్‌తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కీలక టోర్నీల్లో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన స్కై, ఇటీవల ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ వరుస వైఫల్యాలను ఎదుర్కొన్నాడు. దీంతో సెలెక్టర్లు అతడిని జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయలేదు.
సూర్య స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించిన టీమిండియా జింబాబ్వేపై సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో, జట్టులోకి తిరిగి రావాలంటే తన ఆటలో గణనీయమైన మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూర్యకుమార్ గుర్తించాడు. అప్పటి నుంచి అతడు మరింత కసితో సాధన ప్రారంభించాడు. ముంబైలోని వసూ పరాంజపే క్రికెట్ అకాడమీలో సూర్యకుమార్ గంటల తరబడి శ్రమిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. ముందుగా ఫిట్నెస్ కోసం వేగంగా పరుగులు తీసిన ఆయన, అనంతరం నెట్స్‌లో నిరంతరంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సూర్యకుమార్… “ఆదివారం చాలా అద్భుతంగా గడిచింది. వేగంగా పరుగులు తీశాను. మూడు గంటల్లో వెయ్యి బంతులు ఆడాను. ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉంది” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.ఈ పోస్ట్‌కు క్షణాల్లోనే వేలాది లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. “ఇదే నిజమైన అంకితభావం”, “కంబ్యాక్ లోడింగ్”, “స్కై మళ్లీ సూర్యుడిలా ప్రకాశిస్తాడు” అంటూ అభిమానులు కామెంట్లతో ఉత్సాహపరుస్తున్నారు.ఒకప్పుడు ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన సూర్యకుమార్ యాదవ్, ఇప్పుడు అదే స్థాయిలో తిరిగి రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఫిట్నెస్తో పాటు బ్యాటింగ్ టెక్నిక్‌ను కూడా మెరుగుపర్చుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఫామ్ తాత్కాలికమే అయినా క్లాస్ శాశ్వతం. సూర్యకుమార్ తన పాత టచ్ అందుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు మళ్లీ చుక్కలు చూపించడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు.
Sunday was fun. Quick run 🏃🏾
Batted around 1000 balls for 3 hours.
Felt good 💪 pic.twitter.com/x6wH9Ebpmv— Surya Kumar Yadav (@surya_14kumar) July 26, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

