Anna Konidela | అన్నా లెజినోవా కాదు..ఇక నుండి నన్ను అలా పిలవండి..పేరుపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సతీమణి!
Anna Konidela | జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల చేసిన తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా కాలంగా తన పేరును తప్పుగా ప్రచారం చేస్తున్న విషయంపై ఆమె తొలిసారి బహిరంగంగా స్పందించారు. ఇకపై తనను "అన్నా లెజినోవా"గా కాకుండా "అన్నా కొణిదెల"గానే పిలవాలని అభిమానులు, మీడియా, నెటిజన్లకు ఆమె విజ్ఞప్తి చేశారు.
Anna Konidela | జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల చేసిన తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా కాలంగా తన పేరును తప్పుగా ప్రచారం చేస్తున్న విషయంపై ఆమె తొలిసారి బహిరంగంగా స్పందించారు. ఇకపై తనను “అన్నా లెజినోవా”గా కాకుండా “అన్నా కొణిదెల”గానే పిలవాలని అభిమానులు, మీడియా, నెటిజన్లకు ఆమె విజ్ఞప్తి చేశారు. త్వరలో తన పుట్టినరోజు రానున్న నేపథ్యంలో ఈ విషయాన్ని అధికారికంగా చెప్పడానికి ఇదే సరైన సమయమని భావించినట్లు అన్నా తన పోస్టులో పేర్కొన్నారు. ఒక వ్యక్తికి పేరు అనేది ఎంతో వ్యక్తిగతమైన విషయం అని, అందుకే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకున్నానని తెలిపారు.
అన్నా తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “నా ఇన్స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించినప్పటి నుంచే ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఎన్నోసార్లు రాసి మళ్లీ డిలీట్ చేశాను. కానీ ఇప్పుడు నా పుట్టినరోజు దగ్గరపడుతున్న సందర్భంగా చెప్పాలని నిర్ణయించుకున్నాను. మా పెళ్లి వార్తలు బయటకు వచ్చిన సమయంలో అందరికీ నేను ‘అన్నా లెజినోవాగానే పరిచయం అయ్యాను” అని ఆమె పేర్కొన్నారు. అయితే తమ వివాహ ధ్రువీకరణ పత్రంలో మాత్రమే ఆ పేరు చివరిసారిగా నమోదైందని ఆమె వెల్లడించారు. మా పెళ్లి జరిగిన రోజే నేను నా భర్త ఇంటి పేరును స్వీకరించి ‘అన్నా కొణిదెల’గా మారాను. అందుకే ఇకపై నన్ను అన్నా కొణిదెల అని మాత్రమే పిలవండి. అదే నా అసలు పేరు… ఆ పేరులోనే నేను సంపూర్ణంగా ఉన్నానని భావిస్తున్నాను అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు.
ఈ ఎమోషనల్ సందేశంతో పాటు పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఒక అందమైన ఫొటోను కూడా అన్నా షేర్ చేశారు. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరానికి తామిద్దరం కలిసి వెళ్లిన తొలి పర్యటనలో ఈ ఫొటో తీసుకున్నామని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ఫొటోలో పవన్ కళ్యాణ్ కోటు, బ్లాక్ సన్‌గ్లాసెస్‌తో స్టైలిష్ లుక్‌లో కనిపించగా, ఆయన పక్కన అన్నా చిరునవ్వుతో ఆకట్టుకున్నారు. అన్నా చేసిన ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వేలాది మంది స్పందించగా, 60 వేలకుపైగా లైక్‌లు వచ్చాయి. “ఇకపై మిమ్మల్ని అన్నా కొణిదెలగానే పిలుస్తాం”, “హ్యాపీ అడ్వాన్స్ బర్త్‌డే వదినమ్మ” అంటూ జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్లతో ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

