Patlolla Kartik Reddy | మావోళ్ల జోలికొస్తే మాత్రం ఎవరినీ వదల.. అధికారులకు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాస్ వార్నింగ్
Patlolla Kartik Reddy | వచ్చే ప్రభుత్వం మాదే ఉంటది.. నేనింకా 30 సంవత్సరాలు రాజకీయాలు కూడా చేస్తా. ప్రతీ చిన్న అధికారి నుంచి కలెక్టర్ వరకు అందరినీ గుర్తు పెట్టుకుంటా. మీరు మావోళ్ల జోలికొస్తే మాత్రం ఎవరిని కూడా ఎక్కడ కూడా ప్రశాంతంగా పని చేయనీయ చెప్తున్నా.. అంటూ బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
Patlolla Kartik Reddy | మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎవరైనా కానీ మూసీ డెవలప్ మెంట్ పేరుతో బస్తీ వాసులను ఖాళీ చేయిస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి హచ్చరించారు. బస్తీ వాసులకు మద్దతుగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వం చెప్పిందని ప్రజలను రోడ్డుమీద పడేసే ముందు ఒక విషయం చెప్తున్నా.. వీడియోలు మాత్రం జాగ్రత్తగా రికార్డు చేసుకోండి. నేను చెప్పిన విషయం అధికారులకు మాత్రం ఖచ్చితంగా పంపాలన్నారు.
ఇక్కడ పనిచేస్తున్న పోలీస్ అధికారులే కానీ, మున్సిపల్ అధికారులే కానీ.. రెవెన్యూ అధికారులే కానీ.. చెవులు తెరుచుకుని జాగ్రత్తగా వినండి. ప్రభుత్వం చెప్పింది మాకు అని పోలీసులను వెంటబెట్టుకుని వచ్చి హనుమాన్ నగర్ బస్తీ కానీ మిగతా బస్తీలనే కానీ అందరినీ వెళ్లగొట్టి రోడ్డు మీద పడేసి అంతా సాఫ్ చేస్తమంటే ఒక్క విషయం మాత్రం యాది పెట్టుకోండి. వచ్చే ప్రభుత్వం మాదే ఉంటది.. నేనింకా 30 సంవత్సరాలు రాజకీయాలు కూడా చేస్తా. ప్రతీ చిన్న అధికారి నుంచి కలెక్టర్ వరకు అందరినీ గుర్తు పెట్టుకుంటా. మీరు మావోళ్ల జోలికొస్తే మాత్రం ఎవరిని కూడా ఎక్కడ కూడా ప్రశాంతంగా పని చేయనీయ చెప్తున్నా.. అంటూ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
మీరు మావోళ్ల జోలికొచ్చి.. పేదోళ్ల జోలికొచ్చి వీళ్లను రోడ్డుమీద పడేస్తా.. మాకు సెక్రటేరియట్లో ఎవడో చెప్పిండు. నేనొచ్చి ఇక్కడ అరాచకం చేస్తా అంటే మాత్రం.. నేను మిమ్మల్ని వదలా.. మీ వెంట పడతా.. మీరు ఎన్ని రోజులు సర్వీస్‌లో ఉంటరో నేను అన్ని రోజులు వెంటబడి మీ సంగతి చూస్తానని హెచ్చరించారు. మాకేమున్నది మేం ట్రాన్స్ఫర్ అయిపోతం.. హనుమాన్ నగర్వాళ్లను రోడ్డుమీద పడేస్తా. మాకు వాళ్లెవరో చెప్పారు.. అని పోలీస్ అధికారులే కానీ.. మున్సిపల్ అధికారులే కానీ మీరు హైదరాబాద్‌లో పనిచేసినా, మహబూబ్‌నగర్‌లో పనిచేసినా, ఆదిలాబాద్‌లో పనిచేసినా మీ వెంట పడతా.. ఎవరూ కూడా అకారణంగా మావోళ్లను రోడ్డుమీద పడేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదంటూ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.
అధికారులకు బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి వార్నింగ్
ప్రభుత్వం చెప్పిందని ప్రజలను రోడ్డు మీద పడేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి.. వచ్చే ప్రభుత్వం మాదే, నేను ఇంకా 30 సంవత్సరాలు రాజకీయాలు చేస్తాను
చిన్న అధికారి నుండి కలెక్టర్ వరకు ఎవరిని వదలను – బీఆర్ఎస్ నాయకుడు… pic.twitter.com/v8NcGjXCGQ
— Telugu Scribe (@TeluguScribe) March 11, 2026
Read Also :
Air India Plane | హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానం.. థాయ్‌లాండ్‌లో హార్డ్ ల్యాండింగ్
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : కొండపల్లి శ్రీరామ్
Bhuteshwar Dham Temple: మాంసం తిన్న పూజారి.. ఫోటో వైరల్ కావడంతో విధుల నుంచి తొలగింపు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

