Bhuteshwar Dham Temple: మాంసం తిన్న పూజారి.. ఫోటో వైరల్ కావడంతో విధుల నుంచి తొలగింపు
Bhuteshwar Dham Temple: యూపీలోని కాన్పూర్‌కు చెందిన ఓ పూజారి మాంసాన్ని సేవించినట్లు ఫోటో వైరల్ కావడంతో అతన్ని గుడి విధుల నుంచి తొలగించారు. కేశవపురంలోని శ్రీ భూతేశ్వర్ ధామ్ ఆలయంలో ఈ ఘటన జరిగింది.
కాన్పూర్: యూపీలోని కాన్పూర్‌కు చెందిన ఓ పూజారి మాంసాన్ని సేవించినట్లు ఫోటో వైరల్ కావడంతో అతన్ని గుడి విధుల నుంచి తొలగించారు. కేశవపురంలోని శ్రీ భూతేశ్వర్ ధామ్ ఆలయం(Bhuteshwar Dham Temple)లో ఈ ఘటన జరిగింది. ఆ గుడిలోనే ప్రధాన పూజారిగా ఉన్న అతని తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫోటోలో ఉన్న వ్యక్తి తన కుమారుడు ప్రశాంత్ గిరి అని తండ్రి సంతోష్ గిరి గుర్తించాడు. పూజారిగా ఉంటూ మాంసం తిన్న ప్రశాంత్ గిరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఊరేగింపు సమయంలో గుడి వద్ద ఆ వ్యక్తిని బయటకు లాగి చితకబాదారు. ఆ తర్వాత ఆ పూజారీ ఆచూకీ లేడు. నా భార్య, కోడలు ఆపే ప్రయత్నం చేసినా.. స్థానికులు వారిపై కూడా దాడి చేసినట్లు సంతోష్ గిరి తెలిపాడు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే గుడి ప్రాంగణంలో ఉన్న ఓ రూమ్‌లో ప్రశాంత్ గిరి నివసిస్తున్నట్లు తెలిసింది. గుడిలో ఉంటూనే పూజలు చేస్తూ మంసాహారాన్ని సేవించడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

