టేకులపల్లి, మార్చి 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి, మండల ప్రత్యేక అధికారి కొండపల్లి శ్రీరామ్ పలు పాఠశాలలను బుధవారం సందర్శించి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి వంట గది, స్టోర్‌రూమ్‌ను తనిఖీ చేశారు. అలాగే కేజీవీబీ, జీహెచ్ఎస్ టేకులపల్లి ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలకు సంబంధించి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులను ఆదేశించారు. ఈ తనిఖీలలో ఎంపీడీఓ బైరు మల్లీశ్వరి, ఎంపీఓ గాంధీ, మండల అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : కొండపల్లి శ్రీరామ్