KTR : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర జౌళి శాఖ మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కావూరితో గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కావూరి ఆత్మ శాంతించుగాక అని పేర్కొన్నారు.
2013లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో జౌళిశాఖ మంత్రిగా ఉన్న కావూరిని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి ఆహ్వానించానని కేటీఆర్ చెప్పారు. నాడు కావూరి కేవలం నియోజకవర్గాన్ని సందర్శించడం మాత్రమేగాక పవర్ లూమ్ పరిశ్రమకు తన మద్దతు తెలిపారని చెప్పారు.