పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత రెబల్స్‌పై బీజేపీ దృష్టి సారించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్న కేంద్ర మాజీ మంత్రితో సహా ముగ్గురు నేతలను సస్పెండ్ చేసింది. (RK Singh Suspended) బీహార్‌కు చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్, శాసనమండలి సభ్యుడు అశోక్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్‌కు షోకాజ్ నోటీసులు పంపింది. పార్టీ నుంచి వారిని ఎందుకు బహిష్కరించకూడదో వారంలోపు వివరణ ఇవ్వాలని బీహార్ బీజేపీ ప్రధాన కార్యాలయం ఇన్చార్జ్ అరవింద్ శర్మ ఆ నోటీస్‌లో కోరారు.
కాగా, బీహార్‌లోని అర్రా మాజీ ఎంపీ అయిన ఆర్కే సింగ్, 2024 ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి బీజేపీతోపాటు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఎన్డీఏ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మాజీ దౌత్యవేత్త అయిన ఆయన మన్మోహన్ సింగ్ హయాంలో హోం కార్యదర్శిగా ఉన్నారు. 2013లో బీజేపీలో చేరారు. 2014, 2019లో రెండుసార్లు అర్రా నుంచి ఎంపీగా గెలిచారు. 2017లో మోదీ తొలి మంత్రివర్గంలో విద్యుత్ మంత్రిగా పనిచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తన స్థానాన్ని కోల్పోయారు.
Also Read:
Omar Abdullah | ఒమర్ అబ్దుల్లాకు షాక్.. ఆయన రాజీనామా చేసిన బుద్గామ్‌లో ఎన్సీ ఓటమి
Woman Kills Husband | మరిదితో వివాహేతర సంబంధం.. గొడ్డలితో నరికి భర్తను హత్య
Watch: ఖరీదైన కారులో వచ్చి.. వార్తాపత్రికను దొంగిలించిన వ్యక్తి