వెంగళరావునగర్, మార్చి 8 : దాడికి గురైన బాధితులకు న్యాయం చేయాలని వెళ్లిన పెద్ద మనుషులపై ఇన్స్పెక్టర్ రుబాబు చేశారు. వారి సెల్ఫోన్లు లాక్కుని అర్ధరాత్రి వరకు ఠాణాలోనే ఉంచాడు. చివరికి ఓ న్యాయవాది వెళ్లి వారిని విడిపించారు. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ ఠాణాలో చోటు చేసుకుం ది. బాధితుల కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సిరాజ్ అనే వ్యక్తి ఫాల్‌సీలింగ్ పనులు చేసుకుంటూ సుల్తాన్నగర్లోని అద్దె ఇంట్లో నివసిస్తు న్నాడు. నల్లా నీటి విషయంలో సిరా జ్తో పక్కింట్లో ఉండే ఉబేద్ అనే వ్యక్తి గొడవకు దిగాడు.
దాడి చేయడంతో బాధితుడు బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకు న్న సిరాజ్ సోదరులు రాజాబాబు, అహ్మద్ రజాలు సోదరుడి ఇంటికి వచ్చారు. అక్కడ రాజాబాబు,అహ్మద్ రజాలపై ఉబేద్ మరి కొంత మందితో కలిసి దాడి చేశాడు. దీంతో వారు బోబరండ ఠాణాలో ఫిర్యాదు చేశారు. బాధితుల్ని వైద్య పరీక్షల కోసం పోలీసులు అమీర్‌పేట్ లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నిందితుడు ఉబేద్ అమీర్‌పేట్ లోని ప్రభుత్వ దవాఖానకు వచ్చి రెండో సారి సిరాజ్‌పై దాడికి పాల్పడ్డాడు.
విషయం తెలుసుకున్న బస్తీ పెద్ద మను షులు అమీర్‌పేట్ దవాఖానలో వైద్యం కోసం వచ్చిన బాధితులను పరామర్శించడానికి వచ్చారు. వారిని పోలీసులు ఠాణాకు తరలించారు. వారి సెల్ఫోన్లు లాక్కుని అర్ధరాత్రి వరకు స్టేషన్లో ఉంచారు. విషయం తెలుసుకున్న ఓ వ్యాయవాది స్టేషన్‌కు వెళ్లి పోలీ సులను ప్ర శ్నించగా పూచీకత్తు తీసుకుని వదిలివేశారు. అనంతరం ప్రధాని, కేంద్ర హోంమంత్రి, యూపీ సీఎం, తెలంగాణ సీఎం, డీజీపీ, సీపీలకు ట్విట్టర్ లో బాధితులు ఫిర్యారు చేశారు.