భువనేశ్వర్ : కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై దేశ వ్యాప్తంగా విద్యార్థులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భువనేశ్వర్ బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత సచిన్ రహార్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘విద్యార్థుల అలుపెరగని పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది విద్యార్థుల విజయం’ అంటూ పోస్టు పెట్టారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే అర్చిత మరో పోస్టులో.. ‘ధర్మేంద్ర గారు.. మీ పీఏతో మా అమ్మకు ఫోన్ చేయించి నా పోస్టు డిలీట్ చేయించమన్నారు. మీరు శ్రమ పడకండి నేను డిలీట్ చేయను జై హింద్’ అంటూ రాసుకొచ్చారు. ఆ పోస్టులపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. అర్చిత సాయంత్రం మరో పోస్టు పెట్టారు. ‘ధర్మేంద్ర రాజీనామా చేయడం మంచి విషయం అని. ఆయనకు అంతా మంచి జరగాలి’అని పేర్కొన్నారు.