Minister Parthasarathi | మద్యం కుంభకోణంలో జగన్ మోహన్‌రెడ్డిదే కీలక పాత్ర : మంత్రి పార్థసారథి ఆరోపణ
Minister Parthasarathi | వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం లో కర్త, కర్మ, క్రియ అన్నీ జగన్ మోహన్‌రెడ్డే నని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు.
అమరావతి : వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ( Liquor Scam ) లో కర్త, కర్మ, క్రియ అన్నీ జగన్ మోహన్‌రెడ్డే ( YS Jagan ) నని మంత్రి కొలుసు పార్థసారథి ( Minister Parthasarathi ) ఆరోపించారు. ఈ విషయంలో రూ.4 వేల కోట్లు అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మద్యం కుంభకోణం విషయం జగన్ ఎందుకు మాట్లాడరని విమర్శించారు. వైసీపీ, జగన్ దృష్టిలో డీఎస్సీ అంటే డ్రగ్స్, శాండ్, చీప్ లిక్కరని అభివర్ణించారు. కుంభకోణంలో నిందితుల్లో ఒకరైన సత్యనారాయణ అప్రూవర్‌గా మారడంతో అతడికి మతిస్థిమితం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని వైసీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ అక్రమాలతో కూడిన మద్యం పాలసీని తీసుకొచ్చిందని విమర్శించారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నింటినీ అనుకూలంగా మార్చుకుని నిర్వీర్యం చేశారని వెల్లడించారు. వైసీపీ తెచ్చిన మద్యం బ్రాండ్ల వల్ల 30 వేల మంది మహిళల తాళిబొట్లు తెగిపోయాయని తెలిపారు.
మెగా డీఎస్సీలో 16,500 టీచర్ ఉద్యోగాలు ఇస్తే అక్రమాలు జరిగినట్లు జగన్ అసత్య ప్రచారం చేశారని దుయ్యబట్టారు. అసత్య ప్రచారాలను అధికారులు ఎప్పటికప్పుడు వివరణ ఇస్తున్నా ప్రభుత్వంపై బురద చల్లేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

