RS Praveen kumar | మహిళను రమ్మన్న వ్యక్తి ఎవరో..? ఆ గెస్ట్ హౌస్ ఎక్కడ ఉందో కనిపెట్టాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen kumar | ఒక మహిళా వ్యాపార వేత్త యాడ్స్ పని నిమిత్తం సీఎంను కలవాలని సీఎం సన్నిహితుడి వద్దకు వెళ్తే గెస్ట్ హౌస్ కు రమ్మన్నారు అంట. మహిళను రమ్మన్న వ్యక్తి ఎవరో గెస్ట్ హౌస్ ఎక్కడ ఉందో చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి కనిపెట్టాలన్నారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
RS Praveen kumar | అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్ కోసం తాను న్యాయబద్ధంగా అవకాశం ఇవ్వమని అడిగితే, సీఎంకు సన్నిహితుడైన ఒక వ్యక్తి గెస్ట్ హౌస్‌కు రావాలని పిలిచాడంటూ కె.శోభా రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాను ఎవరి పేర్లు చెప్పలేను కానీ ఇలాంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ ట్వీట్లో పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రాన్ని ఎల్ కాంగో పట్టి పీడిస్తోంది. ఎల్ కాంగో 2023 లో వచ్చిందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తీసుకు వచ్చిన యోధుల ఇంటి ముందు కాంగ్రెస్ ఎంపీలు డ్రామాలు చేస్తున్నారు. ఒక మహిళా వ్యాపార వేత్త యాడ్స్ పని నిమిత్తం సీఎంను కలవాలని సీఎం సన్నిహితుడి వద్దకు వెళ్తే గెస్ట్ హౌస్ కు రమ్మన్నారు అంట. ఈ విషయాన్ని ఆ మహిళ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలంగాణ ఇప్పటికే ఫోక్సో కేసులకు అడ్డాగా మారింది. మహిళను రమ్మన్న వ్యక్తి ఎవరో గెస్ట్ హౌస్ ఎక్కడ ఉందో చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి కనిపెట్టాలన్నారు. ఎవరు ఆ ముఖ్యమంత్రి సన్నిహితుడో కనిపెట్టాలి.. ఆ మహిళతో మాట్లాడి ఆమె కన్నీళ్లు తుడవాలన్నారు.
తుమ్మలూరులో రూ.300 కోట్ల విలువ చేసే భూమిని అధికార పార్టీ ఎమ్మెల్యే కబ్జా చేశారు. దీనిపై పోరాటం చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తుమ్మలూరు వెళ్లి భాధితులకు అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ నేతలు చేసే భూ దందాల వివరాలు మాకు ఇవ్వండి. అధికారులు జాగ్రత్తగా ఉండండి.బండి సంజయ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు లొంగిపోవాలి. తెలంగాణలో రాజకీయాలు చేసే నైతిక అర్హత బండి సంజయ్ కు లేదన్నారు. న్యాయ సంహిత చట్టాలు చేసిన కేంద్ర హోం శాఖా సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు . బండి సంజయ్ తెలంగాణ ప్రజల నమ్మకం కోల్పోయారన్నారు.
ఛీ.. ఇంత ఘోరమా!
అడ్వర్టైజింగ్ కంపెనీలో అవకాశం కల్పించండి అని అడిగినందుకు శోభారెడ్డి అనే మహిళను గెస్ట్ హౌస్‌కు రమ్మని సీఎం సన్నిహితుడు పిలిచాడు
చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి.. ఈ గెస్ట్ హౌస్ ఏంటో కనిపెట్టాలి
ఎవరు ఆ ముఖ్యమంత్రి సన్నిహితుడో కనిపెట్టాలి.. ఆ మహిళతో మాట్లాడి… https://t.co/IvSdmxq5k5 pic.twitter.com/GLJr2btq3w
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2026
Read Also :
ATMs | కరీంనగర్లో ఏటీఎంలలో దొంగలు హల్చల్ : వీడియో
Nabha Natesh | సైమా వేడుకల్లో మెరూన్ గౌన్‌లో మెరిసిన నభా నటేష్.. ఫొటోలు వైరల్!
Watch: ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న కుమార్తెను ఆమె కుటుంబం కిడ్నాప్.. తర్వాత ఏం జరిగిందంటే..?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

