గంగా నదిలో చికెన్ బిర్యానీ తింటే నేరమా?
దేశంలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే స్వేచ్ఛ, అసమ్మతి గళం క్రమంగా తగ్గిపోతున్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భుయాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
- అసమ్మతి గళం తగ్గుతున్నది
- న్యాయ వ్యవస్థ విమర్శలకు అతీతం కాదు: జస్టిస్ భుయాన్
న్యూఢిల్లీ: దేశంలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే స్వేచ్ఛ, అసమ్మతి గళం క్రమంగా తగ్గిపోతున్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భుయాన్ ఆందోళన వ్యక్తం చేశారు. భోపాల్‌లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గంగా నదిలో పడవలో రంజాన్ ఉపవాస విరమణ సమయంలో చికెన్ బిర్యానీ తిన్నారనే నెపంతో 14 మంది ముస్లిం యువకులను అరెస్ట్ చేసి, దాదాపు మూడు నెలల పాటు జైలులో ఉంచిన ఉదంతాన్ని ఈ సందర్భంగా జస్టిస్ భుయాన్ ప్రస్తావించారు.
‘చికెన్ బిర్యానీ తినడం ఎక్కడా నేరం కాదు. గంగా నదిపై చికెన్ తినడాన్ని నిషేధిస్తూ ఎలాంటి చట్టం లేదు. కేవలం ఆ కారణంతోనే వారిని అరెస్ట్ చేసి, మూడు నెలలు జైలులో ఉంచడంసరైనదేనా? అని ప్రశ్నించారు. గాజాలో జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ముంబైలోని ఆజాద్ మైదానంలో నిరసన తెలపడానికి సీపీఎం ప్రయత్నించగా, దాన్ని బాంబే హైకోర్టు తోసిపుచ్చిన ఉదంతాన్ని ఆయన గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థ కూడా విమర్శలకు అతీతం కాదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

