Pragathi Palana | కుభీర్, మార్చి 17: పరిశుభ్రతపై ఇంత నిర్లక్ష్యం ఎందుకని.. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ముఖ్య ఉద్దే్శ్యం పరిశుభ్రతేనని నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) వెంకటేశ్వర్లు అధికారులను మందలించారు. మంగళవారం నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని నర్సరీని ఆయన సందర్శించారు. అక్కడే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల చుట్టూ పేరుకుపోయిన చెత్తాచెదారం, అపరిశుభ్రతను చూసిన ఆయన ఎంపీఓ పంచాయతీ కార్యదర్శలపై ఫైర్ అయ్యారు.
జీపీలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లతో పనులను చేయించుకోవాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందించేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఇన్చార్జి హెచ్ఎంను ఆదేశించారు. అంతకుముందు నర్సరీని పరిశీలించినప్పుడు ఇంతవరకు పాలిథిన్ కవర్లలో ఇంకా విత్తనాలు విత్తుకోలేదని నర్సరీలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన విత్తనాలు విత్తాలని సూచించారు. అనంతరం అక్కడినుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన ఔట్ పేషెంట్ రిజిస్టర్ ను పరిశీలించి మందుల స్టాకును అడిగి తెలుసుకున్నారు.
గదులకు వెళ్లి పలువురు పేషంట్లతో అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కాంటింజెంట్ వర్కర్లైన సూది గంగాధర్, దిగంబర్ తమకు ఐదు నెలలుగా వేతనాలు అందడం లేదని.. చాలీచాలని వేతనంతో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఆయన వెంటనే సంబంధిత శాఖాధికారికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. త్వరలో వారి జీతాలు వచ్చేలా చూడాలని సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ వెంట సర్పంచ్ కందూరి సాయినాథ్, ఎంపీఓ భీమేష్, ఏపీవో హర్లాల్, డాక్టర్ విజేష్, ఏపీఎం దత్తాత్రి, ఈజీఎస్ ఐకెపి సిబ్బంది తదితరులు ఉన్నారు.


MP Shanmugam | ‘నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా’.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..?
Hema- Surekha | తోటలో ఎంజాయ్ చేసిన హేమ- సురేఖవాణి.. ఈతకల్లు తాగుతూ హల్చల్
Faisal Malik | బాలీవుడ్ ‘రామాయణ’లో కుంభకర్ణుడిగా ‘పంచాయత్’ నటుడు!