Faisal Malik | బాలీవుడ్ ‘రామాయణ’లో కుంభకర్ణుడిగా ‘పంచాయత్’ నటుడు!
Ramayana | బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రామాయణ' చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది.
Ramayana | బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది. ప్రముఖ వెబ్ సిరీస్ ‘పంచాయత్’లో ప్రహ్లాద్ చా పాత్రతో ఫేమస్ అయిన నటుడు ఫైసల్ మాలిక్ ఈ చిత్రంలో కుంభకర్ణుడి పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో ఈ పాత్ర కోసం బాబీ డియోల్ పేరు వినిపించినప్పటికీ, ఫైసల్ మాలిక్ యొక్క భారీ కాయం, సహజ సిద్ధమైన ఆహార్యం ఈ పాత్రకు అతికినట్లు సరిపోతాయని భావించిన చిత్రబృందం ఆయనను ఖరారు చేసింది. ఇప్పటికే ఫైసల్ మాలిక్ ముంబైలో తన మొదటి షెడ్యూల్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసినట్లు సమాచారం. రావణుడిగా నటిస్తున్న కన్నడ స్టార్ యష్‌తో కలిసి ఆయన కీలక సన్నివేశాలలో నటించారు.
ఈ సినిమాలో కుంభకర్ణుడి పాత్రను అత్యంత భారీగా, విజువల్ వండర్‌గా చూపించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ తరహాలో అత్యాధునిక గ్రాఫిక్స్ (VFX) సహాయంతో ఈ పాత్రను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అంతర్జాతీయ యాక్షన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ బృందం పనిచేస్తోంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న ఈ మెగా ప్రాజెక్టులో ఫైసల్ మాలిక్ చేరడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. త్వరలోనే ఈ భారీ పౌరాణిక చిత్రానికి సంబంధించి మరిన్ని అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

