పాట్నా: బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో ఆర్జేడీ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Yadav) కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) ఆ పార్టీకి, కుటుంబానికి షాక్ ఇచ్చారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే కుటుంబంతో కూడా సంబంధాలు తెంచుకుంటున్నట్లు శనివారం వెల్లడించారు. ‘నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. అలాగే నేను నా కుటుంబాన్ని కూడా వదులుకుంటున్నా. సంజయ్ యాదవ్, రమీజ్ నన్ను చేయమని అడిగింది ఇదే. అన్ని నిందలు నేనే తీసుకుంటున్నా’ అంటూ సంచలన ట్వీట్ చేశారు.
కాగా, రోహిణి ఆచార్య సంచలన ప్రకటన నేపథ్యంలో ఆమెను ప్రభావితం చేసిన సంజయ్ యాదవ్, రమీజ్ ఎవరు? అన్నది చర్చనీయాంశమైంది. సంజయ్ యాదవ్ ఆర్జేడీకి చెందిన రాజ్యసభ ఎంపీ. లాలూ కుమారుడు, ఆ పార్టీ వారసుడు తేజస్వి యాదవ్‌కు అత్యంత విశ్వసనీయ అనుచరుడు. ఉత్తరప్రదేశ్‌లోని రాజకీయ కుటుంబానికి చెందిన తేజస్వి యాదవ్ పాత స్నేహితుడు రమీజ్. అయితే వీరిద్దరూ రోహిణి ఆచార్యకు ఏమి చెప్పారు అన్నది ఆమె పోస్ట్‌లో స్పష్టత లేదు.
మరోవైపు వృత్తిరిత్యా వైద్యురాలైన రోహిణి ఆచార్య, తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ ఇవ్వడంతో వార్తల్లో నిలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని సరన్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేశారు. అయితే బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఓడిపోయారు.
I’m quitting politics and I’m disowning my family …
This is what Sanjay Yadav and Rameez had asked me to do …nd I’m taking all the blame’s— Rohini Acharya (@RohiniAcharya2) November 15, 2025
Also Read:
Bihar election results | ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు.. బీజేపీ, జేడీ(యూ)కి దక్కిన సీట్లు
RK Singh Suspended | బీహార్‌లో రెబల్స్‌పై బీజేపీ చర్యలు.. మాజీ మంత్రితో సహా ముగ్గురు నేతలు సస్పెండ్
woman goes missing in Pak | భారతీయ మహిళ పాక్‌లో అదృశ్యం.. మతం మారి ఆ దేశ వ్యక్తితో పెళ్లి
Man, Live-In Partner Kill Colleague | స్నేహం చేయాలనుకున్న సహోద్యోగి.. హత్య చేసిన సహజీవన జంట