Kalyanikhani | కాసిపేట, మార్చి 17 : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కళ్యాణి ఖని ఓపెన్ కాస్ట్ లో పేలుళ్ల కారణంగా పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు పగళ్లు తేలుతున్నాయి. కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ కు ఆనుకొని ఉన్న సోమగూడెం భరత్ కాలనీ, సోమగూడెం (కే) గ్రామాల్లోని ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. దుబ్బగూడెం ప్రాంతం ఓసీలో పూర్తిగా నష్టపోగా.. వారికి పరిహారంతో పాటు పెద్దనపల్లిలో స్థలాలు కేటాయించి నిర్వాసిత కాలనీగా ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇంకా పూర్తి కాకపోవడంతో దుబ్బగూడెంలోనే నిర్వాసితులు నివాసం ఉంటుండగా వారి ఇళ్లు సైతం పూర్తిగా కూలిపోయే స్థితికి వచ్చాయి. కానీ తమకు న్యాయం చేయలేదనే ఆరోపణలున్నాయి.
ఇదిలా ఉండగా సోమగూడెం భరత్ కాలనీ, సోమగూడెం (కే) గ్రామాల్లోని ఇళ్లు పేలుళ్ల కారణంగా పగుళ్లు వచ్చి ధ్వంసమవుతున్నాయి. ఇళ్లలోని గోడలకు పగుళ్లు తేలుతున్నాయి. లాభాలే లక్ష్యంగా సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల కారణంగా పరిసర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ప్రజా రోగ్యం, పర్యావరణ పరిరక్షణను అస్సలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మోతాదుకు మించి పేలుళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మద్యాహ్నం సమయంలో పేళుళ్ల దాటి విపరీతంగా ఉంటున్నాయని, ఇళ్లలోని సామాగ్రి కింద పడిపోతున్నాయని, ఇళ్లు మొత్తం దద్దరిల్లిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగుళ్ల అనంతరం దురువాసనతో కూడిన విషవాయువులు వెలువడుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ఇలాంటి వాయువులు పీలుస్తూ వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారనే స్థానికులు తెలుపుతున్నారు.
పరిమితికి మించి పేళుళ్ల కారణంగా పేలుళ్ల ప్రకంపనలకు పరిసరాల్లోని ఇళ్లు గోడలు బీటలు వారి క్రమంగా ఇళ్లు శిథిలమైపోతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సింగరేణి అధికారులు ఓపెన్ కాస్ట్ పరిసర ప్రాంతాలైన సోమగూడెంలో కనీసం అభివృద్ధిలో భాగస్వామ్యం కాకపోవడం, స్థానికులకు ఉపాధి అవకాశాలు ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఓసీ పేలుళ్ల కారణంగా పగళ్లు తేలి కూలుతున్న ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
MP Shanmugam | ‘నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా’.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..?
Hema- Surekha | తోటలో ఎంజాయ్ చేసిన హేమ- సురేఖవాణి.. ఈతకల్లు తాగుతూ హల్చల్
Faisal Malik | బాలీవుడ్ ‘రామాయణ’లో కుంభకర్ణుడిగా ‘పంచాయత్’ నటుడు!