Jammu and Kashmir | కాశ్మీర్లో మంచు తుఫాన్.. స్తంభించిన జనజీవనం.. సహాయక చర్యలకు ఆటంకం
Jammu and Kashmir : కాశ్మీర్‌ను మంచు తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. రెండు రోజులుగా మంచు తుఫానుతోపాటు వర్షం కూడా జమ్ము కాశ్మీర్ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. మంగళవారం ఉదయం కాస్త తెరిపినిచ్చినా తర్వాత మంచు కురుస్తూనే ఉంది.
Jammu and Kashmir : కాశ్మీర్‌ను మంచు తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. రెండు రోజులుగా మంచు తుఫానుతోపాటు వర్షం కూడా జమ్ము కాశ్మీర్ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. మంగళవారం ఉదయం కాస్త తెరిపినిచ్చినా తర్వాత మంచు కురుస్తూనే ఉంది. దీంతో లోయలో జనజీవనం స్తంభించింది. మార్చి 20 వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని ఐఎండీ ప్రకటించింది. మంచు తుఫాన్ కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అనేక చోట్ల మైనస్ డిగ్రీలకు టెంపరేచర్ పడిపోయింది.
చాలా చోట్ల 12 అంగుళాల మేర మంచు కురుస్తోంది. జోజిలా పాస్ ప్రాంతంలో 5 అంగుళాలు, సోనామార్గ్ ప్రాంతంలో 3-4 అంగుళాల మంచు కురుస్తోంది. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాలు చాలా ప్రభావితమవుతున్నాయి. రోడ్లపై మంచు పేరుకుపోయింది. దీంతో అధికారులు రోడ్లు మూసివేశారు. అలాగే పొగ మంచు కారణంగా చాలా దూరం వరకు వాహనాలు కనిపించడం లేదు. దీంతో అనంతనాగ్ జిల్లాలోని సింతన్ పాస్ నుంచి కిష్ట్వార్ వెళ్లే నేషనల్ హైవే 244పై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రంతా వాహనాలు రోడ్లపైనే ఉండిపోయాయి. ఇదే సమయంలో ఇక్కడ సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. అయినప్పటికీ ఈ ప్రాంతం నుంచి దాదాపు 400 మంది టూరిస్టులు, సాధారణ ప్రజల్ని అధికారులు రక్షించారు.
ఇండియన్ ఆర్మీకి చెందిన 19 రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోయినా ప్రత్యేక సామగ్రి, తాళ్లు, చైన్లతో సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై చిక్కుకుపోయిన వాహనాల్నలి, ప్రయాణికుల్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇది మంచు కురిసే సమయం అవ్వడంతోపాటు టులిప్ పూలు పూసే సమయం కావడంతో పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

