బోగస్ కు చెక్
క్యూర్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ విధానంలో భారీ మార్పులకు అధికారులు శ్రీకారం చుట్టారు. అక్రమారులకు కాసుల వర్షం కురిపిస్తూ, ఏళ్ల తరబడి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన పాత దరఖాస్తు విధానానికి శాశ్వతంగా స్వస్తి పలకాలని నిర్ణయించారు.
- సీఆర్ఎస్ ద్వారానే జనన, మరణ ధ్రువపత్రాల జారీ
- ఈ-సేవ, మీ-సేవల్లో పాత విధానానికి కేంద్రం స్వస్తి
సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): క్యూర్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ విధానంలో భారీ మార్పులకు అధికారులు శ్రీకారం చుట్టారు. అక్రమారులకు కాసుల వర్షం కురిపిస్తూ, ఏళ్ల తరబడి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన పాత దరఖాస్తు విధానానికి శాశ్వతంగా స్వస్తి పలకాలని నిర్ణయించారు. ఇకపై కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారానే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నారు.
గతంలో ఈ-సేవ, మీ-సేవ కేంద్రాలతో పాటు జీహెచ్ఎంసీ సరిల్ ఆఫీసుల్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకుంటే, సిబ్బంది పంచనామా ఆధారంగా సర్టిఫికెట్లు ఇచ్చేవారు. అయితే, ఈ విధానాన్ని కొందరు అధికారులు, సిబ్బంది తమ అవినీతికి అడ్డాగా మార్చుకున్నారు. ఎదుటివారి అవసరాన్ని బట్టి డబ్బులు వసూలుచేసి పెద్ద ఎత్తున బోగస్ సర్టిఫికెట్లు సైతం ఇచ్చినట్లు విమర్శలున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకే సీఆర్ఎస్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
16 అంకెల యూనిక్ ఐడీ..
నూతనంగా అమలు చేయనున్న సీఆర్ఎస్ సర్టిఫికెట్‌కు ఆధార్ కార్డు తరహాలోనే 16 అంకెల ప్రత్యేక యూనిక్ నంబర్‌ను కేటాయిస్తారు. ఇది దేశంలో ఎకడైనా చెల్లుబాటు అవుతుంది. వాస్తవానికి ఈ కొత్త విధానాన్ని గతేడాది అక్టోబర్‌లోనే తీసుకురావాలని భావించారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మలాజ్‌గిరి జిల్లాల పరిధిలోని అధికారుల విభజన సమస్యగా మారింది. కోర్ సిటీలో మెడికల్ ఆఫీసర్లకు, జిల్లాల్లో కలెక్టర్లకు రిజిస్ట్రేషన్ అధికారాలు ఉండటంతో సమస్య తలెత్తింది. ఈ మూడు కార్పొరేషన్ల రీ-మ్యాపింగ్ ప్రక్రియ పూర్తికావడానికి కొంత సమ యం పట్టింది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ పరిధిలో గత కొన్నేళ్లుగా జారీచేసిన దాదాపు కోటి బర్త్, డెత్ సర్టిఫికెట్ల సమాచారాన్ని ప్రస్తుతం సీఆర్ఎస్ పోర్టల్‌లోకి అప్లోడ్ చేసే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. డేటా అప్లోడింగ్ పూర్తయిన వెంటనే పాత వెబ్సైట్ సేవలను పూర్తిగా నిలిపివేసి, నూతన సీఆర్ఎస్ సేవలను పౌరులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
పరిహారానికి హెచ్ఆర్సీ సిఫారసు
సుల్తాన్‌బజార్,ఆగస్టు 11: కంటిశుక్లాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న 18 మంది రోగులు వైద్యుల నిర్లక్ష్యంతో చూపును కోల్పోయిన ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన కేసు నమోదు చేశారు.హనుమకొండలోని జయా దవాఖానలో ప్రభుత్వ కంటి వెలుగు కార్యక్రమం కింద కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న 18 మంది రోగులు వైద్య నిర్లక్ష్యంతో చూపును కోల్పోయారనే ఆరోపణలపై కమిషన్ సుదీర్ఘంగా విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా ఆరోగ్యశాఖ సమర్పించిన నివేదికలు, బాధితులు,వారి కుటుంబాల వాంగ్మూలాలు, ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన వైద్య నిపుణుడు డాక్టర్ రాజీవ్ కె.రెడ్డి సమర్పించిన నివేదికను కమిషన్ పరిశీలించింది.ఈ విచారణ అనంతరం జయా దవాఖానలో ఆపరేషన్ థియేటర్ నిర్వహణ, రోగుల భద్రతలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు కమిషన్ నిర్ధారించింది. బాధితులకు తీవ్రమైన ఎంటిరోబ్యాక్టర్ క్లోసీ కంటి ఇన్ఫెక్షన్ రావడంతో చూపు కోల్పోయినట్లు కమిషన్ నిర్ధారించింది. 12 మంది బాధితులకు ఒక్కొక్కరికి రూ.4లక్షలు, కేసు విచారణ పెండింగ్‌లో మరణించిన 6 బాధితుల తదుపరి వారసులకు ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కమిషన్ సిఫారసు చేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

