ప్రకృతి- ప్రళయం
ఈ సృష్టి ఎంత అద్భుతమైనదో, దాని తెర వెనుక నడిచే కాలపు నాటకం అంతకంటే విచిత్రమైనది. మనిషి తన మేధస్సుతో ఆకాశాన్నీ, అంతరిక్షాన్నీ శాసించేస్తున్నానని భుజాలు ఎగిరేస్తున్నాడు. నేనే సర్వస్వం అనుకుంటూ దర్పంతో విర్రవీగుతున్నాడు. కానీ, ఆ సర్వశక్తిమంతుడైన సృష్టికర్త ఒక చిన్న చదరంగపు కాయను కదిలిస్తే చాలు... ఈ అహంకారపు సామ్రాజ్యాలు క్షణాల మీద ఇసుక కోటల్లా కూలిపోతాయి.
ఈ సృష్టి ఎంత అద్భుతమైనదో, దాని తెర వెనుక నడిచే కాలపు నాటకం అంతకంటే విచిత్రమైనది. మనిషి తన మేధస్సుతో ఆకాశాన్నీ, అంతరిక్షాన్నీ శాసించేస్తున్నానని భుజాలు ఎగిరేస్తున్నాడు. నేనే సర్వస్వం అనుకుంటూ దర్పంతో విర్రవీగుతున్నాడు. కానీ, ఆ సర్వశక్తిమంతుడైన సృష్టికర్త ఒక చిన్న చదరంగపు కాయను కదిలిస్తే చాలు… ఈ అహంకారపు సామ్రాజ్యాలు క్షణాల మీద ఇసుక కోటల్లా కూలిపోతాయి.
విపత్తులు – దైవిక హెచ్చరికలు
నిజానికి, ప్రకృతి విపత్తులు అంటే కేవలం భూమి కదలడమో, నదులు పొంగిపొర్లడమో కాదు. అవి దైవిక శక్తి ముందు మానవుని అస్తిత్వపు అసమర్థతను ఎత్తిచూపే నిదర్శనాలు! పవిత్ర ఖురాన్ ఈ సత్యాన్ని ఎంత చక్కగా గుర్తుచేస్తుందంటే:‘మనుషుల చేతులు సంపాదించుకున్న కర్మల కారణంగానే భూమిపై, సముద్రంలో కల్లోలం చెలరేగింది. వారు తమ (చెడు) కర్మల నుంచి వెనక్కి మళ్లే నిమిత్తం అల్లాహ్ వారికి తమ కర్మల ఫలితాలను కొద్దిగా రుచి చూపిస్తాడు’ (ఖురాన్ 30:41) అని హెచ్చరించింది.సమాజంలో పాపాలు హద్దులు మీరినప్పుడు, ధర్మం మరుగున పడి అన్యాయం తాండవిస్తున్నప్పుడు, ఆ దేవుడు మనుషులను మేల్కొల్పడానికి ఇలాంటి విపత్తులనే పెద్ద చౌకీదారులుగా పంపుతాడు. ఇవి కేవలం శిక్షలు మాత్రమే కావు; దారి తప్పిన మనిషిని మళ్లీ సన్మార్గంలో నడిపించడానికి వచ్చే గట్టి హెచ్చరికలు.
మహా వినాశనం..
ఈ చిన్న చిన్న విపత్తులు రాబోయే ప్రళయ కాలానికి సూచికలు. మహా వినాశనం వేళ భూమి తన కడుపులో దాచుకున్న నిధులను, భారాన్ని ఒక్కసారిగా కక్కివేసే భీకర భూకంపాలు వస్తాయి. ఈ సంఘటనను ఖురాన్ స్పష్టంగా తెలియజేసింది. ‘భూమి తన అత్యంత భీకరమైన ప్రకంపనలతో కంపించినప్పుడు, భూమి తనలో దాచుకున్న బరువులన్నిటినీ బయటికి కక్కివేసినప్పుడు, మనుషుడు ‘దీనికి ఏమైంది?’ అని విస్మయానికి గురైనప్పుడు…’ (ఖురాన్ 99:1-3) అంతా వినాశనమే! మానవుడి పాపాలు శ్రుతి మించినప్పుడు నేల కుంగిపోవడం, ఆకాశం నుంచి ఆపదలు ముంచెత్తడం జరుగుతుంది. ఆపై ఏర్పడే అశాంతి, జరిగే మహా విలయం ఈ భూగోళాన్ని అతలాకుతలం చేస్తాయి. మొత్తంగా చూస్తే… ఈ ప్రపంచం శాశ్వతం కాదనీ, ఇదొక తాత్విక ప్రయాణమనీ, మనిషి తన గర్వాన్ని విడనాడి నీతిగా, నిజాయితీగా, తోటివారికి సాయపడుతూ బతకాలనీ ఈ విపత్తులన్నీ మూగ భాషలో మనకు మళ్లీ మళ్లీ గుర్తుచేస్తూనే ఉన్నాయి. ఈ సృష్టికి ఒక అంతం ఉందన్న సత్యాన్ని గ్రహించి, ఆ దేవుని మార్గంలో నడవడమే మానవ జన్మకు సార్థకత!
– ముహమ్మద్ ముజాహిద్, 96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

