అభివృద్ధి పేరుతో విధ్వంసం.. మున్సిపల్ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ ధర్నా
మధిర పట్టణంలో అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ నాయకులు తీవ్ర విధ్వంసానికి, అవినీతికి పాల్పడుతున్నారని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు లింగాల కమల్‌రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- మధిరలో ‘అధికార’ నాయకుల అక్రమాలు
- కమీషన్ల కోసమే కాంగ్రెస్ నేతల ఆరాటం
- జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు
మధిర, ఆగస్టు 11: మధిర పట్టణంలో అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ నాయకులు తీవ్ర విధ్వంసానికి, అవినీతికి పాల్పడుతున్నారని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు లింగాల కమల్‌రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మధిరలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మధిర మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో మధిరలో ఎలాంటి ప్రగతి జరగలేదని అన్నారు. రూ.128 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించి 17నెలలు కావొస్తున్నా ఏ ఒక వీధిలోనూ పని సంపూర్ణం ఎందుకు కాలేదన్నారు.
పట్టణమంతా రోడ్లు తవ్వి గతుకులమయం చేశారని, అంబులెన్స్ కూడా రాలేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కమీషన్లు వచ్చే పనులను మాత్రమే కాంగ్రెస్ నేతలు శరవేగంగా చేస్తున్నారని ఆరోపించారు. శ్మశానవాటికలో మట్టి పోసినందుకు రూ.18 లక్షలు, గతంలో తాము రూ.4 లక్షలతో చేసిన జిమ్ పనులకు రూ.40 లక్షల బిల్లులు వేసుకుని దోచుకున్నారని విమర్శించారు. మధిరలో మున్నేరు వరద తాకిడి నుంచి రక్షణ కోసం నిర్మిస్తున్న గోడ విషయంలో రైతుల భూములను అక్రమంగా లాకుంటున్నారని, ముందస్తు సమాచారం లేకుండా నిరుపేదల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ అవినీతిపై రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ మేనేజర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. బీఆర్ఎస్ నాయకులు యాన్నంశెట్టి అప్పారావు, బికీ కృష్ణప్రసాద్, రావూరి శ్రీనివాసరావు, పల్లబోతుల వెంకటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరరావు, ఆరిగె శ్రీనివాసరావు, బొగ్గుల భాసర్‌రెడ్డి, పరిశ శ్రీనివాసరావు, సయ్యద్ ఇక్బాల్, వంకాయలపాటి నాగేశ్వరరావు, నాగబాబు, ఉమామహేశ్వర్‌రెడ్డి, కపిలవాయి జగన్మోహన్రావు, బొగ్గుల వీరారెడ్డి, భువనగిరి నారాయణరావు, బానోతు కృష్ణ, చీరాల రాంబాబు, డోకుపర్తి సత్యంబాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

