Keralam Congress : కేరళంలో త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో పార్టీ మంగళవారం తొలి జాబితాను ప్రకటించింది. తొలి దశ అభ్యర్థుల ఖరారులో భాగంగా ఎన్నికల కోసం 55 మందిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక. వీరిలో 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా.. ఒక్క ఎంపీకి కూడా చోటు దక్కలేదు. అనూహ్యంగా పెరుంబవూరు ఎమ్మెల్యే ఎల్దోసే కున్నప్పిల్లికి తొలి దశ జాబితాలో చుక్కెదురైంది.
కేరళంలోని 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్లకు చివరి తేదీ మార్చి 23 కావడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశాయి. కాంగ్రెస్ పార్టీ సైతం 55 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. సీనియర్లు వీ.డీ. సతీషన్ పరావుర్, రమేశ్ చెన్నితాలా హరిపాడ్ నుంచి పోటీ చేయనున్నారు.
Congress announces first list of 55 candidates for the upcoming Keralam Assembly Elections
State party president Sunny Joseph fielded from Peravoor seat, VD Satheesan fielded from Paravur, Chandy Oommen from Puthuppally, Ramesh Chennithala from Haripad, Ramya Haridas from… pic.twitter.com/S7qDjtg6qK
— ANI (@ANI) March 17, 2026
సన్నీ జోసెఫ్ పెరావుర్, కే. మురళీధరన్ వట్టియూరావు, రమేశ్ పిషరొడి పాలక్కడ్ నుంచి బరిలోకి దిగనున్నారు. అయితే.. ప్రధానమైన కన్నూర్, కొన్ని సీట్లకు అభ్యర్ధులను ఇంకా ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకులు కే.సుధాకరన్, అడూర్ ప్రకాశ్ సైతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
కేరళంలో ఈసారి కూడా ప్రధాన పోటీ పెద్ద పార్టీల మధ్యే జరుగనుంది. సీఎం పినరయి విజయన్ సారథ్యంలోని అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్), యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్), బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోకట్రికక్ కూటమి(ఎన్డీఏ) మధ్య పోటీ ఆసక్తికరంగా సాగనుంది. ఓటర్ల జాబితా విషయానికొస్తే.. దాదాపు 2.71 కోట్ల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో సాధారణ, సర్వీస్ ఓటర్లు ఉన్నారు. అయితే.. ఓటర్లలో మహిళల శాతమే అధికంగా ఉండడం విశేషం.
మహిళా ఓటర్లు – 1.38 కోట్లకుపైగా.
పురుష ఓటర్లు – 1.31 కోట్లు.
ట్రాన్స్జెండర్లు – 277 మంది.
18-19 ఏళ్ల మధ్య ఉన్నవారు – 4.24 లక్షలకుపైనే.
85 ఏళ్లకు పైబడిన వారు – 2 లక్షల పైనే.
దివ్యాంగులు – 2.44 లక్షలు.
First list of BJP candidates announced for Kerala.
Union Minister George Kurian : Kanjirappally
State BJP Chief Rajeev Chandrashekhar : Nemom
Navya Haridas : Kozhikode North
PC George : Poonjar
Ex Union Minister V Muraleedharan : Kazhakootam
Shobha Surendran : Pallakad pic.twitter.com/cMZmEF9e15
— News Arena India (@NewsArenaIndia) March 16, 2026