Joe Kent | యూఎస్ కౌంటర్ టెర్రరిజం చీఫ్ జో కెంట్ రాజీనామా.. ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే ఇరాన్‌పై దాడి చేశామన్న కెంట్
Joe Kent : ఇరాన్‌తో యుద్ధం సాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వంలో అమెరికా కౌంటర్ టెర్రరిజం చీఫ్‌గా ఉన్న జో కెంట్ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు.
Joe Kent : ఇరాన్‌తో యుద్ధం సాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వంలో అమెరికా కౌంటర్ టెర్రరిజం చీఫ్‌గా ఉన్న జో కెంట్ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న ఈ యుద్ధాన్ని తాను సమర్ధించడం లేదని, ఇందుకు తన అంతరాత్మ ఒప్పుకోదని జో కెంట్ అన్నారు. ఇప్పటికిప్పుడు ఇరాన్ నుంచి అమెరికాకు ఎలాంటి ముప్పు లేదని, అందువల్ల అమెరికాకు ఈ యుద్ధం అవసరం లేదన్నాడు.
అయితే, ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి దిగిందని కెంట్ స్పష్టం చేశారు. అమెరికాకు ఇజ్రాయెల్ అతిపెద్ద లాబీయింగ్ చేసే దేశమన్నారు. అయితే, విదేశాలకు సంబంధించి ఇప్పటివరకు ట్రంప్ అనుసరించిన విధానాల్ని తాను సమర్ధి్స్తానని కెంట్ తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌కు కీలక సూచనలు చేశాడు. ‘‘2016, 2020, 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ చెప్పిన విషయాలు, విలువలకు నేను మద్దతుగా ఉన్నాను. 2025 జూన్ వరకు మిడిల్ ఈస్ట్ యుద్దాలు ఒక ట్రాప్లాగా భావించే వారు. వాటివల్ల అమెరికా సంపదకు నష్టం కలుగుతుందని, అమెరికా దేశ భక్తులైన సైనికుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని, మనకు ఆర్థికంగా నష్టం కలుగుతుందని భావించేవారు. ట్రంప్ మొదటి పాలనలో ఇతర ఆధునిక అధ్యక్షులకన్నా గొప్పగా ఆలోచించి, మన సైన్యాన్ని ఎలాంటి యుద్ధంలోకి పంపలేదు.
ఐసిస్ సంస్థను, క్వాసం సోలామని లాంటి వారిని అంతం చేసి మరీ ఇది నిరూపించారు. అయితే, రెండోసారి ఎన్నికైన తర్వాత ఇజ్రాయెల్ ప్రభావంతో ఇరాన్‌ను ముప్పుగా భావించారు. దీంతో ఈ యుద్ధం మొదలైందని, వేలాది మంది అమెరికన్ సైనికుల ప్రాణాలు పణంగా పెట్టారు’’ అని కెంట్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ పరిస్తితిని సరిదిద్ది అమెరికాకు ఒక చక్కని దారి చూపాలని తన లేఖలో కోరాడు. అధ్యక్షుడు ట్రంప్ పాలనలో పని చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

