Lokesh Kanagaraj | లోకేష్ కనకరాజ్ ‘డిసి’ సక్సెస్‌కి అల్లు అర్జున్ టీమ్ గ్రాండ్ సెలబ్రేషన్.. వైరల్ అవుతున్న ఫొటోలు!
Lokesh Kanagaraj | కోలీవుడ్ నుంచి ఇటీవల వచ్చిన ‘డిసి’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన లోకేష్ కనకరాజ్.. ఈ సినిమాతో హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇంటెన్స్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆయనకు మాస్ హీరోగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
Lokesh Kanagaraj | కోలీవుడ్ నుంచి ఇటీవల వచ్చిన ‘డిసి’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన లోకేష్ కనకరాజ్.. ఈ సినిమాతో హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇంటెన్స్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆయనకు మాస్ హీరోగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ‘డిసి’ సినిమాకు తమిళనాడుతో పోలిస్తే తెలుగులో మరింత మంచి స్పందన లభించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరించడంతో లోకేష్ కనకరాజ్ కూడా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు.
‘డిసి’ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు లోకేష్ కనకరాజ్ హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఏ, ఏఎంబీ సినిమాస్‌కు వెళ్లారు. అక్కడ తెలుగు ప్రేక్షకులతో కలిసి సినిమా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. తెలుగు ఆడియన్స్ నుంచి తన సినిమాకు వచ్చిన స్పందనపై ఆయన సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.దర్శకుడిగా ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న లోకేష్.. హీరోగా చేసిన సినిమాకు కూడా అదే స్థాయిలో ఆదరణ లభించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ‘డిసి’ సక్సెస్‌ను అల్లు అర్జున్ తదుపరి సినిమా టీమ్ కూడా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న ఆయన కెరీర్‌లోని 23వ సినిమాకు సంబంధించిన టీమ్.. లోకేష్ కనకరాజ్‌తో కలిసి కేక్ కట్ చేయించి సక్సెస్ విషెస్ తెలిపింది.
అల్లు అర్జున్‌తో లోకేష్ కనకరాజ్ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం లోకేష్ హీరోగా సక్సెస్ అందుకోవడంతో.. భవిష్యత్‌లో అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరిగింది. అల్లు అర్జున్-లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. తమ బ్యానర్లో దర్శకుడిగా పనిచేయబోతున్న లోకేష్.. హీరోగా సాధించిన విజయాన్ని నిర్మాణ సంస్థ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసింది. ఈ సందర్భంగా లోకేష్ కనకరాజ్‌తో కేక్ కట్ చేయించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు కూడా ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. అల్లు అర్జున్-లోకేష్ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Team #AA23 & @MythriOfficial celebrated the massive success of #DC with @Dir_Lokesh ❤️🔥
Congratulations on the blockbuster success of #DC. Now, it’s time for #AA23 🔥💪🏻 pic.twitter.com/DCdqAhjU9x
— Mythri Movie Makers (@MythriOfficial) August 14, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- DC
- kamal hassan
- Khaidi-2
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

