న్యూఢిల్లీ: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ(PM Modi) దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. దిమాగీ నక్సల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దిమాగీ నక్సల్స్ పదాన్ని ఆయన పూర్తిగా వివరించలేదు కానీ, వారిని గుర్తించి, వేరు చేయాలని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. దిమాగీ నక్సల్స్ ఓ కొత్త రకమైన శత్రువు అన్నట్లు ఆయన తెలిపారు. మావోయిస్టు మైండ్సెట్ ఉన్న వ్యక్తులు ఇప్పుడు దేశ రాజకీయాల్లో భాగస్వామ్యం అవుతున్నారని, కొందరు ప్రభుత్వ కమిటీల్లోనూ అడ్వైజర్లగా విధులు నిర్వర్తిస్తున్నారని, మావోయిస్టు ఐడియాలజీ దేశ విధానాలపై ప్రభావం చూపిందని, దట్టమైన అడవుల్లో ఉండే నక్సల్స్ను అంతం చేశామని, ఆ సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించామని, సాయుధ నక్సలైట్లు అంతం అయినా, దిమాగీ నక్సల్స్ మాత్రం అలాగే ఉన్నారని ప్రధాని అన్నారు. ఆ నక్సల్స్ దేశంలో హింస, అల్లర్లు సృష్టిస్తున్నారని మోదీ ఆరోపించారు. సమాజాన్ని తమ తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లేందుకు విభిన్న వ్యూహాలను అమలు చేస్తుంటారని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Delhi: Prime Minister Narendra Modi says, “People with a Maoist mindset had carved out a place for themselves in the corridors of power within the nation. Even as advisors in government committees, this Maoist ideology exerted influence over national policies. My dear fellow… pic.twitter.com/ALNe0itsi2
— IANS (@ians_india) August 15, 2026