హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): సమస్య వస్తే ప్రజలు అధికార పార్టీ ఎమ్మెల్యే వద్దకు వెళ్లడం సహజం. ఇక్కడ ఏకంగా తమ నియోజకవర్గ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రిగా ఉన్నా తమ బాధను పట్టించుకోకపోవడంతో ఓ యువకుడు ప్రతిపక్ష పార్టీ నేత వద్దకు సాయం కోసం వచ్చాడు. ఉపాధి కోసం ఒమన్ వెళ్లిన తన తల్లి ఏడాదిగా అకడే చికుకుపోయిందని, ఆమెను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని కొడంగల్ నియోజకవర్గానికి చెందిన యువకుడు తుప్పుడు రాజు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను వేడుకున్నాడు.
తన తల్లిని భారత్‌కు తీసుకురావడానికి సహాయం చేయాలని కన్నీటిపర్యంతమయ్యాడు. తమ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా సమస్య పరిషారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణభవన్‌లో మంగళవారం తనను కలిసి గోడు వెళ్లబోసుకున్న యువకుడి సమస్యపై కేటీఆర్ వెంటనే స్పందించారు. బీఆర్ఎస్ ఒమన్ ఎన్నారై విభాగం ప్రతినిధులతో మాట్లాడి బాధితురాలు భారత్‌కు తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ‘మీ అమ్మను స్వదేశానికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అధైర్యపడవద్దు’ అని భరోసా ఇచ్చారు.
కుటుంబ భారం.. ఏడారి బాట
కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గోకపసాల్వాడ్కు చెందిన తుప్పుడు లక్ష్మి భర్తను కోల్పోయి, కుటుంబ భారాన్ని మోస్తూ ఉపాధి కోసం ఎడారి బాటపట్టింది. ఆమెకున్న ఒకగానొక కొడుకు రాజును ప్రయోజకుడిని చేయాలని ఏడాది క్రితం మసట్ వెళ్లింది. ఆరు నెలలపాటు పని మనిషిగా చేసిన అనంతరం జీతం ఇవ్వకుండా యజమాని వేధించడం మొదలుపెట్టాడు. జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఫోన్ ద్వారా లక్ష్మి తన కొడుకి చెప్పింది. తల్లి బాధను చూడలేక రాజు ఇండియాకు రావాలని చెప్పడంతో, అది విన్న మసట్ యజమానులు లక్ష్మి ఫోన్ గుంజుకొని అజ్ఞాతంలోకి పంపారు.
నిత్యం కొడుతూ వేధిస్తూ ఇబ్బందులు పెడుతుండటంతో, రాజు స్థానిక నాయకుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఎవరూ పట్టించుకోలేదు. ఎలాగైనా తన తల్లిని ఇండియాకు రప్పించాలని రాజు ఎక్స్‌లో తన బాధను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. రాజు సమస్య తెలుసుకున్న కేటీఆర్ తనను వచ్చి కలువాలని సూచించడంతో మంగళవారం తెలంగాణభవన్‌కు వచ్చి సమస్య వివరించాడు. వెంటనే స్పందించి ఒమన్ ఎన్నారై విభాగంతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించినందుకు కేటీఆర్‌కు రాజు కృతజ్ఞతలు తెలిపాడు. తన తల్లి క్షేమంగా భారత్‌కు తిరిగివస్తే అదే తనకు ఎంతో పెద్ద సాయమని, కేటీఆర్ ఇచ్చిన భరోసాతో తన తల్లి స్వదేశానికి వస్తుందన్న ఆశ కలిగిందని రాజు మీడియాతో తెలిపాడు.