రామాంజనేయ కాలనీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంజనేయ కాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దాదాపు...
చుంచుపల్లి, నవంబర్ 19 : కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంజనేయ కాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దాదాపు 100 ఇళ్లను తనిఖీ చేయడంతో పాటు 54 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను పరిశీలించారు. తనిఖీల్లో సుమారు 120 ఐఎంఎఫ్ఎల్ మద్యం బాటిళ్లను గుర్తించి నాలుగు కేసులు నమోదు చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 45 జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆదినారాయణ కాలనీవాసులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మూఢనమ్మకాలు, రహదారి భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు.

రామాంజనేయ కాలనీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
ప్రజలు గుర్తు తెలియని లింకులు క్లిక్ చేయవద్దని, ఓటీపీ, బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. వాహనదారులు హెల్మెట్, సీటు బెల్ట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు. ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్పీ వెంట సబ్ డివిజన్ సిఐలు శ్రీలక్ష్మి, వెంకటేశ్వర్లు, యాసీన్, జితేందర్, ఇంద్రసేనారెడ్డి ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రామాంజనేయ కాలనీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
Cyclone Akvan | అక్వాన్ తుపాను ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. పూరీ తీరం వెంట ఎర్ర జెండాలు.. Video
Lung Health Problems | చలికాలంలో శ్వాసకోశ సమస్యల పట్ల జాగ్రత్త.. ఇలా చేస్తే ఇబ్బందులు ఉండవు..
KA Paul | రేవంత్ రెడ్డిది అవినీతి పాలన.. కనీసం ప్రజలకు మంచి నీళ్లు ఇవ్వడం లేదు: కేఏ పాల్ ఫైర్
‘జలాల్పూర్ చెరువు కట్ట మూల మలుపు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

