‘జలాల్పూర్ చెరువు కట్ట మూల మలుపు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి’
జలాల్పూర్ చెరువు కట్ట మూల మలుపు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సుమారు గంటసేపు ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకోని ఎమ్మెల్యే...
– బీజేపీ శ్రేణుల ధర్నా
భూదాన్ పోచంపల్లి, నవంబర్ 19 : జలాల్పూర్ చెరువు కట్ట మూల మలుపు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సుమారు గంటసేపు ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకోని ఎమ్మెల్యే, అభివృద్ధిపై సోయి లేని ఎమ్మెల్యే, కుంభం అనిల్ కుమార్ రెడ్డి డౌన్ డౌన్, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, ప్రజా సమస్యలపై స్పందించని ఎమ్మెల్యే రాజీనామా చేయాలి అంటూ నినాదాలు చేశారు. రోడ్డు పనులను వెంటనే చేపట్టకపోతే త్వరలోనే వంటా వార్పు కార్యక్రమం చేపడతామని నాయకులు హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పోచంపల్లి ఇన్చార్జి ఏలే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు పోతున్న ఎమ్మెల్యే పట్టించుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల పాలనలో ఏం పనులు చేశారని ఆయన ప్రశ్నించారు.

‘జలాల్పూర్ చెరువు కట్ట మూల మలుపు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి’
స్థానిక ఎస్ఐ జగన్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాలు చేరుకుని ఆందోళనను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరు నరోత్తం రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సుర్కంటి రంగారెడ్డి, జిల్లా ఎండోమెంట్ కో కన్వీనర్ కేసారం కృష్ణారెడ్డి, జిల్లా కౌన్సిలర్ నెంబర్ పల్లెకాడి బసవయ్య, మండల అధ్యక్షుడు మేకల రవీందర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేకల చొక్కా రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి రామిడి యాదిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పునూతల నరసింహ, గ్రామ శాఖ అధ్యక్షుడు పాలకుర్ల నవీన్, నాయకులు బడుగు శ్రీకాంత్, సీత మణికంఠ, భేతి నిఖిల్, చేరాల లింగయ్య, మధు, మధుసూదన్ రెడ్డి, బండిరాల సుశీల పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘జలాల్పూర్ చెరువు కట్ట మూల మలుపు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి’
‘భద్రాచలం ఛాంబర్ ఎన్నికలు న్యాయబద్ధంగా జరపాలి’
Telangana RERA | రెరా.. ఇది తగునా? రియల్ రంగంలో అవినీతికికొమ్ముకాస్తున్నట్లు విమర్శలు
MLA Raja Singh | ఆయన చెప్పింది నిజమే…తెలంగాణలో గుండాల రాజ్యం, అవినీతి రాజ్యం నడుస్తుంది : ఎమ్మెల్యే రాజాసింగ్
Yadagirigutta | యాదగిరిగుట్టలో ప్రారంభమైన కోటి పుష్పార్చన
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

